Balakrishna: నందమూరి అందగాడు సింహం అయితే.. రిజల్ట్‌ ఏంటి?

  • January 7, 2023 / 12:14 PM IST

నందమూరి నట‘సింహం’ అంటూ సింహాన్ని తన బిరుదులోనే ఇముడ్చుకున్నాడు బాలకృష్ణ. అందుకు తగ్గట్టుగా ‘సింహం’ అని వచ్చేలా చాలా సినిమాలు చేశారు. అందులో కెరీర్‌ బెస్ట్‌లు, ఇండస్ట్రీ బెస్ట్‌లు చాలానే వచ్చాయి. తాజాగా ‘వీర సింహా రెడ్డి’ పేరుతో ఈ సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర మాస్‌ జాతర చేయడానికి వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు బాలయ్య ఎత్తిన ‘సింహా’వతారాలు ఏంటి, వాటి సంగతేంటి అనేది చూద్దాం.

* ఎన్టీఆర్‌తో కలసి బాలకృష్ణ 1983లో నటించిన చిత్రం ‘సింహం నవ్వింది’. దాసరి యోగానంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సరైన ఫలితం అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమా ఎన్టీఆర్‌ పాత్ర చిత్రణ నవ్వులు పూయిస్తుంది.

* 1994లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘బొబ్బిలి సింహం’. రోజా, మీనా కథానాయికలుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌.

* ఫ్యాక్షన్‌ సినిమాలకు ఊపు తీసుకొచ్చిన చిత్రం ‘సమర సింహా రెడ్డి’. 1999లో వచ్చిన ఈ సినిమాలో బాలయ్యను దర్శకుడు బి.గోపాల్‌ ఫుల్‌ మాస్‌ మోడ్‌లో చూపించారు. బాలకృష్ణ సరసన సిమ్రాన్, అంజలా ఝవేరి, సంఘవి అదరగొట్టారు.

* బాలయ్య – బి.గోపాల్‌ కాంబినేషన్‌లో 2001లో వచ్చిన చిత్రం ‘నరసింహనాయుడు’. ఈ సినిమా విజయం గురించి ఎంత చెప్పానా తక్కువే. 2001లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమాలో సిమ్రాన్, ప్రీతి జింగానియా హీరోయిన్లు.

* సీమ సినిమాలతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే బాలయ్య 2002లో ‘సీమ సింహం’గా వచ్చారు. బాలకృష్ణకు నాయికలుగా సిమ్రాన్, రీమా సేన్ నటించారు. జి.రామ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు ఫలితం చేదే.

* బాలకృష్ణ రీసెంట్‌ బ్లాక్‌బస్టర్స్‌ లిస్ట్‌లో తొలి స్థానాల్లో ఉండే సినిమా ‘సింహ’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2010లో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార, నమిత, స్నేహ ఉల్లాల్‌ నటించారు.

* తమిళంలో మంచి విజయం అందుకున్న ‘సామి’ సినిమాను తెలుగులో ‘లక్ష్మీ నరసింహ’గా తీసుకొచ్చారు బాలయ్య. 2014లో వచ్చిన ఈ సినిమాలో అశిన్‌ కథానాయికగా నటించింది. మాతృకలో విక్రమ్‌ నటించాడు.

* తెలుగు సింహాలతోపాటు బాలయ్య ఇంగ్లిష్‌ సింహంలో కూడా నటించారు. 2015లో ‘లయన్‌’ పేరుతో ఓ సినిమా చేశారు. బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఆశించిన విజయం అందుకోలేదు.

* కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో ‘జై సింహా’ టైటిల్‌తో 2018లో బాలయ్య ఓ సినిమా చేసారు. బాలయ్య సరసన ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించింది.

* గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమా చేశాడు. ఈ సినిమాను జనవరి 12న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్‌ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus