ఆ మిగతా రెండు అక్షరాలు ఏమయ్యింటాయబ్బా?

ఈమధ్యకాలంలో సినిమా తీయడం, విడుదల చేయడం కంటే కూడా ఆ సినిమాను జనాలకి చేరువ చేయడం, సినిమాకి బజ్ తీసుకురావడం, సినిమా హాళ్ళకి జనాల్ని రప్పించడం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. మామూలుగా ఆడియో రిలీజ్ లు చేసి రెండు ప్రెస్ మీట్స్ పెట్టేసి, పేపర్-టీవి యాడ్స్ ఇస్తుంటే జనాలు సినిమాని అంతగా పట్టించుకోవడం లేదు. అందుకే దర్శకనిర్మాతలు సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ నుంచి విశేషమైన జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

అందుకు మహేష్ బాబు & టీం కూడా మినహాయింపేమీ కాదు. మహేష్ బాబు గత చిత్రం “భరత్ అనే నేను” విషయంలో ఫాలో అయిన పబ్లిసిటీ స్ట్రాటజీస్ ను దృష్టిలో పెట్టుకొని 25వ సినిమాని కూడా డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తున్నారు. టైటిల్ ఎనౌన్స్ మెంట్ నుండే సినిమా జనాల నోళ్లలో నానేలా జాగ్రత్తలు తీసుకొంటూ.. ఆగస్ట్ 9న విడుదల చేయబోయే మహేష్ 25వ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను కాస్త ఇన్నోవేటివ్ గా రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా టైటిల్ లోని మొదటి మూడు అక్షరాలైన “ఆర్, ఐ, ఎస్”ను రోజుకొకటి చొప్పున విడుదల చేశారు. దాంతో ఇప్పటికే చాలా మంది ఈ సినిమా టైటిల్ “రిషి” అని ఫిక్స్ అయిపోగా.. కొందరు మాత్రం మిగతా రెండు అక్షరాలు ఏమై ఉంటాయా? అని ఆలోచిస్తున్నారు.

ఏదేమైనా ఇలా ఫస్ట్ లుక్ రిలీజ్ కి ముందే మహేష్ 25వ సినిమా చేస్తున్న హల్ చల్ కి ఆయన అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. ఏప్రిల్ లో ఉగాది కానుకగా విడుదలకానున్న ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus