ఇటీవల కాలంలో ఎక్కువ పుకార్లు వచ్చిన సినిమాలు ఏమైనా ఉన్నాయా అంటూ లిస్ట్ రాస్తే… అందులో టాలీవుడ్ నుండి తొలి స్థానాల్లో ‘గుంటూరు కారం’, ‘దేవర’ కనిపిస్తాయి. తొలి సినిమా విషయంలో నిర్మాత నాగవంశీ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ సమస్య లేకుండా చూసుకుంటున్నారు. కానీ ‘దేవర’ విషయంలో ఇలా జరగడం లేదు. సినిమా హీరో కానీ, నిర్మాత కానీ, దర్శకుడు కానీ ఎక్కడా స్పందించడం లేదు. ఎందుకు అని అడిగితే నిర్మాతల్లో ఒకరైన కల్యాణ్ రామ్ ఆసక్తికర విషయం చెప్పారు.
‘దేవర’ ఎంత వరకు పూర్తయింది… సంక్రాంతికి స్పెషల్ వీడియో ఏమైనా వచ్చే అవకాశముందా అని అడిగితే… సినిమా అప్డేట్ చెబుతూనే ఎందుకు ఈ సినిమా విషయంలో మాట్లాడటం లేదు అనే సంగతి కూడా చెప్పారు కల్యాణ్ రామ్. ‘దేవర’ సినిమా 80 శాతం షూటింగ్ పూర్తయ్యింది. గ్లింప్స్ ఎప్పుడన్నది మేము చూసుకుని, అంతా ఓకే అనుకున్నాక విడుదల తేదీ చెబుతాం అని తెలిపారు. మేము చేసే సినిమాలు గొప్పగా ఉండాలని అనుకుంటాం.
అందుకనే అవుట్పుట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం అని కూడా చెప్పారు. అంతేకాదు తాను, తారక్ ‘దేవర’ సినిమా విషయంలో క్లియర్గా ఉన్నామని, ఇద్దరికీ క్లారిటీ వచ్చినా కూడా క్లియర్గా లేకపోతే ఏ న్యూస్పైనా స్పందించకూడదని నిర్ణయించుకున్నామని తెలిపారు. దీంతో ఈ సినిమా విషయంలో అంతా ఓకేనా అనే డౌటానుమానం మొదలైంది నెటిజన్లలో. దానికి కారణం ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చే విషయంలో టైమ్ పడుతుంది అని కల్యాణ్ రామ్ చెబితే…
మరోవైపు సంగీత దర్శకుడు అనిరుథ్ మాత్రం ఈ సినిమా టీజర్ రెడీ అవుతోంది అని ట్వీట్ చేశారు. దీంతో ఇటు నిర్మాత ఇలా, అటు సంగీత దర్శకుడు అలా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ లెక్కన కొత్త సంవత్సరం వస్తుంది అని చెబుతున్న (Devara) ‘దేవర’ టీజర్ వస్తుందో లేదో చూడాలి.