వెంకీమామ సినిమాపై స్పందించిన చిత్ర బృందం

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో వెంకీ సరసన తమన్నా, వరుణ్ సరసన మెహ్రీన్ జంటగా కనిపించనున్నారు. ఇది సంక్రాంతికి థియేటర్లోకి రానుంది. దీని తర్వాత బాబీ దర్శకత్వంలో మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకీ ఓ చిత్రం చేయబోతున్నారు. ఇందుకు వెంకీ మామ అనే టైటిల్ అనుకున్నట్టు సమాచారం. అయితే ఈ చిత్ర లైన్ నచ్చినప్పటికీ.. స్క్రిప్ట్ సంతృప్తికరంగా లేకపోవడంతో ప్రాజక్ట్ ని పక్కన పెట్టినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రాజక్ట్ ఆగిపోలేదని స్పష్టం చేసింది.

‘జై లవ కుశ’ ఫేమ్ బాబీ తెరకెక్కించనున్న ఈ చిత్రం వచ్చే నెల రెండో వారంలో సెట్స్ మీదకు వెళ్లనుందని వెల్లడించింది. వెంకటేష్ ‘ఎఫ్ 2’ చిత్రీకరణ ను పూర్తి చేసిన తర్వాత ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటారని సురేష్ ప్రొడక్షన్ సంస్థ ట్విట్టర్ వేదికపై స్పష్టం చేసింది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా ఖరారు అయ్యారు. కోన ఫిలిం కార్పొరేషన్, సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మామ అల్లుళ్ల సందడి ఓ రేంజ్ లో ఉండబోతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus