Abbas Hospitalised: హాస్పిటల్ బెడ్ పై అబ్బాస్.. వైరల్ అవుతున్న ఫోటో..!

‘ప్రేమదేశం’ చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోగా మారిపోయాడు అబ్బాస్. ఆ తర్వాత ఇతనికి చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే అందులో హీరోగా చేసినవి తక్కువ. ఎక్కువగా సెకండ్ హీరోగా చేసిన సినిమాలే ఉన్నాయి. అందువల్ల ఇతను స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు. ఓ సినిమా హిట్ అయ్యాక..వరుస ఆఫర్లు రావడంతో.. ఏమిటి, ఎందుకు అని ఆలోచించకుండా ప్రతీ ఆఫర్ కు సైన్ చేసేశాడు. ఇతను నటించిన తెలుగు సినిమాల్లో కూడా ఎక్కువగా సెకండ్ హీరోగానే కనిపించాడు.

రాజా, కృష్ణబాబు, ప్రియా ఓ ప్రియా వంటి సినిమాల్లో ఇతను నటించడం జరిగింది. తర్వాత విలన్ గా కూడా పలు సినిమాల్లో నటించాడు. అందులో నితిన్ నటించిన ‘మారో’ మూవీ కూడా ఒకటి. ఇదిలా ఉండగా.. అబ్బాస్ కొన్నాళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. విదేశాల్లో మోటివేషనల్ క్లాసెస్ చెప్పే జాబ్ చేస్తున్నాడు. భవిష్యత్తులో సినిమాల్లో కనిపించే అవకాశమే లేదు అని ఇతను తెలిపాడు. ఇదిలా ఉండగా..అబ్బాస్ హాస్పిటల్ లో చేరిన ఒక ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇంకో ఫోటోలో అతను నడవలేని కనిపిస్తున్నాడు. “నా కుడి కాలికి శస్త్ర చికిత్స జరిగింది. నేను ఆసుపత్రిలో ఉన్న సమయంలో నా మనస్సు ఏమాత్రం ప్రశాంతంగా లేదు, కానీ నేను లోపల ఉన్న భయాన్ని అధిగమించడానికి ప్రయత్నించాను, శస్త్ర చికిత్స అనంతరం త్వరలో ఇంటికి చేరుకుంటాను. నా కోసం ప్రార్థించిన, ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అబ్బాస్ తెలిపాడు. ఇక అతని కుడి మోకాలి లిగమెంట్‌లో ఏర్పడిన సమస్య శస్త్రచికిత్సకు దారితీసినట్లు తెలుస్తుంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus