అందాల రాముడులో రోల్ కోసం నన్ను చాలా రిక్వెస్ట్ చేశాడు

“ఇస్మార్ట్ శంకర్” కథ నాదే అని గత కొన్ని రోజులుగా హడావుడి చేస్తూ.. మళ్ళీ చాన్నాళ్ల తర్వాత వార్తల్లో వ్యక్తిగా నిలిచిన “ఆనందం” ఫేమ్ ఆకాష్ ఉన్నట్లుండి కమెడియన్ టర్నడ్ హీరో టర్నడ్ కమెడియన్ సునీల్ మీద భారీ స్థాయిలో ఎలిగేషన్స్ చేస్తున్నాడు. “ఆనందం” సినిమా టైమ్ లో తాను ఫుల్ ఫామ్ లో ఉండగా సునీల్ తో ఫ్రెండ్ షిప్ ఏర్పడిందని.. “పిలిస్తే పలుకుతా” సినిమాలో నటిస్తున్నప్పుడు బాగా క్లోజ్ అయ్యామ్. తాను “అందాల రాముడు” సినిమాతో హీరోగా ఉన్న టైమ్ లో నేను తమిళంలో ఒక సినిమా చేస్తుండగా.. “ఇవి చేతులు కావు కాళ్ళు అనుకో.. నాకోసం “అందాల రాముడు” సినిమాలో చిన్న రోల్ ప్లే చెయ్” అని అడుక్కున్నాడు సునీల్.

అదే సునీల్ “నవ వసంతం” షూటింగ్ లో నన్ను చాలా అవమానించాడు. అప్పటివరకూ నన్ను భయ్యా అని పిలిచిన సునీల్.. అప్పట్నుంచి “ఏయ్ ఆకాష్” అని పిలిచేవాడు అంటూ సునీల్ తనను ఎలా అవమానించాడో చెప్పుకొచ్చాడు ఆకాష్. ప్రస్తుతానికి ఈ ఎలిగేషన్స్ పెద్దగా హైలైట్ అయ్యే అవకాశం లేకపోయినప్పటికీ.. ఆకాష్ ఎందుకని ఇలా టార్గెట్ చేస్తున్నాడో సునీల్ కే తెలియాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus