ఇవివి సత్యనారాయణ గారి చిన్నబ్బాయిగా సినీరంగ ప్రవేశం చేసిన నరేష్ .. తన మొదటి చిత్రం అల్లరి తో హిట్టు కొట్టి.. ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు అల్లరి నరేష్. అటు తర్వాత కామెడీ సినిమాలతో స్టార్ డం ను సొంతం చేసుకున్నాడు. కేవలం కామెడీ సినిమాలకే పరిమితం అయిపోకుండా గమ్యం, శంభో శివ శంభో, నేను, వంటి భిన్నమైన రోల్స్ కూడా చేసి మెప్పించాడు.
ఇక 2015 లో అల్లరి నరేష్ విరూప అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఓ పాప కూడా ఉంది. ఆమె పేరు అయాన. ఆమె 6 వ బర్త్ డే సెలబ్రేషన్స్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి: