హిందీ చిత్రం తో వంద కోట్ల క్లబ్ లోకి చేరిన హీరో దీపక్!

తెలుగు లో సంపంగి, నీ తోడు కావాలి, కనులు మూసినా నీవాయే, ప్రేమలో పావని కళ్యాణ్, అరుంధతి, భద్ర, కింగ్,మిత్రుడు వంటి విజయవంత మైన చిత్రాలలో నటించిన హీరో దీపక్ 100 కోట్ల క్లబ్ లో చేరాడు. విషయానికొస్తే….హిందీ లో గురు, ప్యాషన్ వంటి భారీ చిత్రాలలో నటించిన దీపక్ ఇటీవల విడుదల అయిన ‘రుస్తుం’ లో అక్షయ్ కుమార్ , ఇలియానా లతో పాటు ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ లో హిట్ అయ్యి రెండు వారాలలో 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ చిత్రం లో దీపక్ నటనకు మీడియా నుండి క్రిటిక్స్ నుండి అభినందనలు లభించాయి.

ఈ సందర్భంగా హీరో దీపక్ మాట్లాడుతూ – ” నా సినీజీవితం ప్రారంభమైంది ఇక్కడే, దర్శక నిర్మాత సానా యాది రెడ్డి గారు నన్ను పరిచయం చేసిన తొలి చిత్రం ‘సంపంగి’ మొదటి చిత్రం తోనే తెలుగు ప్రేక్షకులు ఆదరించారు ఆశీర్వదించారు అందుకు మీ కందరికి కృతజ్ఞుడను. ఆ తరువాత నేను నటించిన అన్ని చిత్రాలను కూడా అదే విధంగా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. నేను నటించిన తెలుగు సినిమాలనే చూసి హిందీ లో కూడా నాకు అవకాశాలు వచ్చాయి. అందులో భాగం గానే ఇటీవల విడుదల అయిన రుస్తుం లో కూడా నాకు అత్యంత ముఖ్యమైన పాత్ర లభించింది. ఈ చిత్రం రెండు వారాల్లో 100 కోట్ల క్లబ్ లో చేరినందుకు చాలా సంతోషం గా వుంది. అంతే కాకుండా నేను పోషించిన విక్రమ్ క్యారెక్టర్ కి మంచి రివ్యూస్ మీడియా నుండి వచ్చినందుకు ఇంకా ఆనందంగా వుంది. అందుకు నన్ను ప్రోత్సహించిన ప్రేక్షకులకు, దర్శకులకు నిర్మాతలకు రుణపడి వుంటాను. ఈ ఆనందాన్ని నన్ను నటుడిగా గుర్తించిన టాలీవుడ్ ప్రముఖులతో, తెలుగు ప్రేక్షకుల తో పంచుకుందామని ఈ వార్త ద్వారా తెలియచేస్తున్నాను.నన్ను మొదటి నుండి ప్రోత్సహిస్తున్న దర్శక నిర్మాత సానా యాది రెడ్డి గారికి, దిల్ రాజు గారికి, బోయపాటి శ్రీను గారికి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, శ్రీను వైట్ల గారికి, భీమనేని శ్రీనివాస రావు గారికి ధన్యవాదాలు. హిందీ లో ఎన్ని సినిమాలు చేసిన తెలుగు చిత్రాలలో నటించడమంటే నే నాకు ఇష్టం.తెలుగు లో నటనకు స్కోప్ వున్నా నెగటివ్ రోల్స్ చేయడానికైనా నేను రెడీ.” అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus