Karthi: స్టార్ హీరో కార్తీ అభిమానుల సంచలన నిర్ణయం.. ఏమైందంటే?

కార్తీ హీరోగా తెరకెక్కిన జపాన్ మూవీ టీజర్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కార్తీ గత సినిమాలు తెలుగులో సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా కార్తీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జపాన్ సినిమాలో కార్తీ క్రేజీ దొంగగా కనిపించనున్నారు. ఈ సినిమా కార్తీ హీరోగా నటిస్తున్న 25వ సినిమా కాగా దీపావళి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

“రేయ్ ఎన్ని బాంబులేసినా ఈ జపాన్ ను ఎవరూ ఏం పీకలేరురా” అంటూ టీజర్ లో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా బంగారం చుట్టూ తిరిగే యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. అయితే కార్తీ అభిమానులు చేసిన ఒక పని ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా కార్తీ 25వ సినిమా కావడంతో కార్తీ ఫ్యాన్స్ 25 రోజుల పాటు 25,000 మందికి ఫ్యాన్స్ అన్నదానం చేస్తున్నారు.

కార్తీ నిర్వహిస్తున్న ఉళవన్ సేవా ట్రస్ట్ ద్వారా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చెన్నైలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కోరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని తెలుస్తోంది. కార్తీ అభిమానులు పేదల కడుపు నింపేలా తీసుకున్న నిర్ణయానికి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. జపాన్ చిత్ర బృందం ఈ అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

జపాన్ సినిమా కార్తీ (Karthi) కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తుందేమో చూడాల్సి ఉంది. జపాన్ సినిమా ఫుల్ రన్ లో ఏ రేంజ్ కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. కార్తీ తెలుగులో తన మార్కెట్ ను మరింత పెంచుకుంటారేమో తెలియాల్సి ఉంది. కార్తీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus