కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కొడుకు అయిన అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతూ చేసిన చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.’అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై శ్రీమతి గల్లా పద్మావతి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమాకి ఐ.ఎం.డి.బి లో అయితే మంచి రేటింగ్ వచ్చింది కానీ క్రిటిక్స్ నుండీ మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ ను మూటకట్టుకుంది.
అయినప్పటికీ ఓపెనింగ్స్ పర్వాలేదు అనే విధంగా నమోదయ్యాయి. కానీ వీకెండ్ తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా వరకు చేతులెత్తేసింది. ‘హీరో’ ఫస్ట్ వీక్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
0.62 cr
సీడెడ్
0.29 cr
ఉత్తరాంధ్ర
0.33 cr
ఈస్ట్
0.15 cr
వెస్ట్
0.10 cr
గుంటూరు
0.17 cr
కృష్ణా
0.11 cr
నెల్లూరు
0.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
1.85 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.08 Cr
ఓవర్సీస్
0.10 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
2.03 cr
‘హీరో’ చిత్రానికి రూ.5.5 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.03 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో 3.97 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రెండు రోజులు పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం వీక్ డేస్ లో మాత్రం స్లీపేసింది.ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి ‘హీరో’ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుంది అని అంతా అనుకున్నారు కానీ కరోనా ఎఫెక్టో లేక ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోవడం వలనో కానీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో రాబట్టడం లేదు.సెకండ్ వీకెండ్ ను ఏమైనా క్యాష్ చేసుకుంటుందేమో చూడాలి..!