ఇంద్రగంటి తో నాని ‘వ్యూహం’ ఫలిస్తుందా..?

నాని ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ‘జెర్సీ’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తరువాత విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తన 24 వ చిత్రమైన ‘గ్యాంగ్ లీడర్’ షూటింగ్లో పాల్గొంటాడు. ఇక ఈ చిత్రం తరువాత తన 25 వ చిత్రం చేయడానికి కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. తనని హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో ఓ మల్టీ స్టారర్ చిత్రంలో నటించాడానికి రెడీ అవుతున్నాడట. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.

ఈ చిత్రంలో మరో హీరోగా సుదీర్ బాబు నటించబోతున్నాడట. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ మల్టీస్టారర్ కు టైటిల్ ను ఫిక్స్ చేసేసారట. ‘వ్యూహం’ అనే టైటిల్ ను ఈ చిత్రానికి ఖరారు చేశారట. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయ్యిందని సమాచారం. కానీ హీరోలు ఇంకా కాలి అవ్వకపోవడంతో ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉందట. ఇంద్రగంటి మోహనకృష్ణ గతంలో నాని, సుదీర్ బాబు ఇద్దరినీ డైరెక్ట్ చేసాడు. ఇప్పుడు వీరిద్దరిని ఒకే తెరపై చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇక కథ ప్రకారం ఈ చిత్రంలో నాని నెగేటివ్ రోల్ చేయబోతున్నాడట. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus