నేచురల్ స్టార్ నానికి (Nani) తన సినిమాలపై కంటెంట్ పై, తెలుగు ఆడియన్స్ పై ఎక్కువ నమ్మకమే ఉంటుంది. ఒక్కోసారి ఫలితాలు తేడా కొట్టినా.. నాని చెప్పిన ఎలిమెంట్స్ సినిమాలో మిస్ అవ్వవు. అది అతను నటించే సినిమా అయినా, నిర్మించే సినిమా అయినా..! ఉదాహరణకు గత నెలలో రిలీజ్ అయిన ”కోర్ట్’ (Court) సినిమా కనుక మీకు నచ్చకపోతే… నా ‘హిట్ 3’ (HIT 3) సినిమాకి మీరు రాకండి’ అంటూ రిస్కీ స్టేట్మెంట్ ఇచ్చాడు.
అది రిస్క్ కాదు నాని నమ్మకం అని తర్వాత అందరికీ తెలిసొచ్చింది. మరి ఇప్పుడు ‘హిట్ 3’ కి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు నాని అని కొందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు జరిగిన ‘హిట్ 3’ ట్రైలర్ లాంచ్లో ఓ రిపోర్టర్…”లాస్ట్ వన్ మంత్ బ్యాక్ ‘కోర్ట్’ సినిమాకి మీరు ఒక డైలాగ్ వాడారు మీరు.
‘కోర్ట్’ సినిమా కనుక మీకు నచ్చకపోతే ‘హిట్ 3’ చూడొద్దు అని. ఇప్పుడు ‘హిట్ 3’ కోసం ఎలాంటి డైలాగ్ వాడతారు?” అంటూ ప్రశ్నించాడు. అందుకు నాని.. ” ‘హిట్ 3’ తర్వాత నెక్స్ట్ సినిమాకి నేను ప్రొడ్యూసర్ ని కాదు. నన్ను నేను తాకట్టుపెట్టుకోగలను. కానీ వేరే నిర్మాతని నేను తాకట్టుపెట్టలేను కదా. కానీ ‘హిట్ 3’ వంటి రేసీ థ్రిల్లర్,ఇలాంటి ఒక జోనర్,వయొలెన్స్, ఇఫ్ నెరేటెడ్ వెల్, టోల్డ్ వెల్..
మీరు కనుక అలాంటి సినిమాలు ఎంజాయ్ చేసే ఆడియన్స్ అయితే మే ఫస్టుకి మీకు 100 శాతం ఫుల్ మీల్స్. మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ తెలుగులో. మీకు కనుక నేను చెప్పింది కరెక్ట్ కాదు అనిపిస్తే… నెక్స్ట్ టైం నానిని నమ్మకండి” అంటూ బదులిచ్చాడు. నాని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
నన్ను నేను తాకట్టు పెట్టుకోగలను కానీ.. వేరే వాళ్ళని పెట్టలేనుగా
మే 1st కి ఫుల్ మీల్స్ పక్కా..
ఒకవేళ మీకు నేను చెప్పింది సరికాదు అనిపిస్తే నెక్స్ట్ టైం నానీని నమ్మకండి#Hit3 #HIT3Trailer #Nani #SaileshKolanu pic.twitter.com/vt2UbGalNk
— Filmy Focus (@FilmyFocus) April 14, 2025