HIT 3: హాట్ టాపిక్ అయిన ‘హిట్ 3’… లీక్డ్ వీడియో!

నేచురల్ స్టార్ నాని వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు. ‘దసరా’ ‘హాయ్ నాన్న’ ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. ‘వీటి తర్వాత నాని ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు?’ అనే చర్చ చాలాకాలం పాటు నడిచింది. ఈ క్రమంలో ‘బలగం’ వేణు, శ్రీకాంత్ ఓదెల వంటి డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. కానీ ఊహించని విధంగా నాని శైలేష్ కొలనుకి ఛాన్స్ ఇచ్చాడు. వాస్తవానికి ఇది కొత్త ప్రాజెక్ట్ ఏమీ కాదు. ‘హిట్ 2’ టైంలోనే అనౌన్స్ చేశారు.

HIT 3

కానీ నాని మిగతా ప్రాజెక్టులతో బిజీ అవ్వడం.. శైలేష్ కూడా ‘సైందవ్’ తో బిజీ అవ్వడం వల్ల ప్రాజెక్ట్ డిలే అవుతూ వస్తుంది. మొత్తానికి ‘హిట్ 3’ కి మోక్షం కల్పించాడు నాని. ఈ మధ్యనే హిట్ 3 కి సంబంధించి ఓ ప్రోమో విడుదల చేశారు. అందులో అర్జున్ సర్కార్.. గా నాని చాలా మాస్ గా కనిపించాడు. ‘హిట్ 3’ లో కూడా ‘హిట్ 2’ లో మాదిరి చాలా వయొలెన్స్ ఉంటుందని ఓ క్లారిటీ కూడా వచ్చేసింది. ఇక మరోపక్క ‘హిట్ 3’ షూటింగ్ కూడా సైలెంట్ గా స్టార్ట్ అయిపోయింది.

‘హిట్ 3′ కి సంబంధించి వైజాగ్లో కీలక షెడ్యూల్ ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన ఓ వీడియో లీక్ అయ్యింది. ప్రస్తుతం అది ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.’కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఇందులో నానికి జోడీగా నటిస్తోంది. వీరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు తాజాగా షెడ్యూల్లో నిర్వహిస్తున్నారు అని ఈ వీడియో ద్వారా అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.

మరోసారి పెళ్లి చేసుకోబోతున్న ఫైర్‌ బ్రాండ్‌ వనిత.. నిజమేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus