Vanitha Vijaykumar: మరోసారి పెళ్లి చేసుకోబోతున్న ఫైర్‌ బ్రాండ్‌ వనిత.. నిజమేనా?

ఇండస్ట్రీలో ఒకటికి మించిన పెళ్లిళ్లు అనే టాపిక్‌ వచ్చినప్పుడల్లా అందరూ ఓ స్టార్‌ హీరో వైపు చూస్తారు కానీ.. ఓ కథానాయిక కూడా ఇలాంటి వరుస పెళ్లిళ్లు, విడాకులకు బ్రాండ్‌ అంబాసిడర్‌లా మారిపోయింది. ఇదేదో ఆమె మీద విమర్శ కాదు.. తక్కువ చేయడమూ కాదు. ఆమె వరుస వివాహాల విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఎందుకు ఆమె గురించి చర్చ అంటే.. ఆమె నాలుగో పెళ్లికి రెడీ అయిందని వార్తలు వస్తున్నాయి కాబట్టి.

Vanitha Vijaykumar

వనిత విజయ్ కుమార్.. ఈ నటి గురించి తెలియని వారు ఉండరు. సినిమాలతో పెద్దగా అభిమానుల సంపాదించుకుందో లేదో తెలియదు కానీ.. పెళ్లి – విడాకులతో మాత్రం భారీగా ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది. ఒకానొక సమయంలో ఆమె ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా వైరల్‌ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆమె నాలుగో పెళ్లి చేసుకుంటోంది అంటూ ఓ వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఆమె నాలుగో పెళ్లికి రెడీ అవుతోందా? అని అంటున్నారు.

దీనికి కారణం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో. వనిత విజయ్ కుమార్‌కు ఇన్నాళ్లకు ఓ తోడు దొరికింది అంటూ ఆ ఫొటో సారాంశంగా చెప్పుకొస్తున్నారు. రాబర్ట్ అనే కోలీవుడ్ కొరియోగ్రాఫర్‌తో ఆమె ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లి అని చెబుతున్నారు. వనితి మూడో భర్త పీటర్ పాల్‌తో పెళ్లికి ముందు రాబర్ట్‌తో వనిత డేటింగ్‌లో ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయనతోనే నాలుగో పెళ్లి అంటున్నారు. మరికొందరేమో ఇదంతా సినిమా ప్రచారం కోసం చేస్తున్న స్టంట్‌ అని చెబుతున్నారు.

ఎందుకంటే.. వనిత – రాబర్ట్ కలసి ‘మిస్టర్ అండ్ మిసెస్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రచారం కోసమే ‘సేవ్ ది డేట్ – అక్టోబర్ 5’ అని పోస్టర్‌ రిలీజ్‌ చేశారు అని చెబుతున్నారు. ఇక వనిత.. తొలుత నటుడు ఆకాశ్‌ను పెళ్లి చేసుకుంది. ఐదేళ్ల బంధంలో ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత విడాకులు ఇచ్చేసి వ్యాపారవేత్త ఆనంద్ జయదర్శన్‌ను పెళ్లాడింది. ఐదేళ్లు కాపురం తర్వాత ఫొటోగ్రాఫర్ పీటర్ పాల్‌ను మనువాడింది. కొన్ని రోజులకే ఇద్దరూ విడిపోయారు.

ఆటో బయోగ్రఫీలో అఫైర్‌.. 15ఏళ్ల తర్వాత స్పందించిన స్టార్‌ నటుడి మాజీ భార్య!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus