Hero Nani: ఆ సినిమాలు ఫ్లాపైనా నాని నమ్మకం ఇప్పుడు నిజమైందా?

  • April 1, 2023 / 05:35 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నాని సినిమా సినిమాకు క్రేజ్ ను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే నాని తన సినీ కెరీర్ లో గతంలో ఎన్నో మాస్ సినిమాలలో నటించినా ఆ సినిమాలు నాని కోరుకున్న విజయాన్నిఅయితే అందించలేదు. దసరా సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడగా కొత్త డైరెక్టర్ కావడంతో నాని ఫ్యాన్స్ సైతం టెన్షన్ పడ్డారు. అయితే సినిమా రిలీజ్ కు ముందే కాన్ఫిడెన్స్ తో ఉన్న నాని తన నమ్మకమే నిజమని ప్రూవ్ చేసుకున్నారు.

పట్టువదలని విక్రమార్కుడిలా నాని అనుకున్నది సాధించారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. తొలిరోజే 20 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం సులువు కాదని నాని మాత్రం ఆ అరుదైన ఫీట్ ను సులువుగానే సొంతం చేసుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాని కథను నమ్మి ముందుకెళుతున్నారని అందుకే ఆయన నమ్మకం ప్రతిసారి నిజం కావడంతో పాటు సక్సెస్ దక్కుతోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అంటే సుందరానికి ఫుల్ రన్ కలెక్షన్లు 22 కోట్ల రూపాయలు కాగా ఆ కలెక్షన్లను నాని (Nani)  ఒకరోజులోనే సాధించి ఆశ్చర్యపరిచారు. కీర్తి సురేష్ ఇమేజ్ ను సైతం ఈ సినిమా మార్చేసింది. సర్కారు వారి పాట తర్వాత కీర్తి ఖాతాలో మరో హిట్ చేరింది. వెన్నెల పాత్రకు కీర్తి సురేష్ తప్ప మరెవరూ న్యాయం చేయలేరనేంత బాగా ఆమె నటించారు. ప్రేక్షకులు మెచ్చేలా కథ, కథనం ఉండటం ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది.

మరి కొందరు మాత్రం దసరా మూవీలో సాయిపల్లవి నటించి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. ఈ తరహా పాత్రలకు సాయిపల్లవి మరింత అద్భుతంగా న్యాయం చేస్తారని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాని దసరా సినిమాతో కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడని కొంతమంది చెబుతున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus