Nani: ఇప్పట్లో ‘హిట్ 3’ లేనట్టేనా.. నాని షాకింగ్ డెసిషన్!

  • March 25, 2023 / 03:26 PM IST

నాని నిర్మాణంలో ‘హిట్’ ‘హిట్2’ సినిమాలు రూపొందాయి.విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్’ మంచి విజయం సాధించింది. దీంతో ‘హిట్2’ రేంజ్ పెంచడానికి విశ్వక్ కంటే మార్కెట్ ఎక్కువ ఉన్న హీరో కావాలని అడివి శేష్ తో చేశారు. ‘హిట్3’ కి ఇంకా ఎక్కువ మార్కెట్ ఉన్న హీరో కాబట్టి నాని చేస్తున్నాడు. ఇలా హిట్ యూనివర్స్ లో 7 కేసులు ఉంటాయని చెప్పకనే చెప్పారు. అయితే ‘హిట్ 3’ కి సంబంధించిన ప్రోమో ‘హిట్ 2’ లోనే చూపించేశారు.

అర్జున్ సర్కార్ అనే పాత్రలో నాని హిట్ 3వ కేసును డీల్ చేయబోతున్నట్టు చెప్పకనే చెప్పారు. దీంతో ‘హిట్'(సిరీస్) లకు కూడా ఫ్యాన్స్ పెరిగారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు నాని ‘హిట్ 3’ పై దృష్టి పెడుతున్నట్టు కనిపించడం లేదు. ప్రస్తుతం ‘దసరా’ ప్రమోషనల్ యాక్టివిటీస్ లో బిజీగా గడుపుతున్న నాని.. అటు తర్వాత తన 30వ చిత్రం షూటింగ్లో పాల్గొంటాడు. అది కూడా పూర్తయ్యాక ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు అన్న విషయం ఇంకా బయటకు రాలేదు. కానీ ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే ‘హిట్ 3’ సంగతి ఆలోచిస్తాడు నాని (Nani). దీనికి ఇంకో కారణం కూడా ఉంది. ‘హిట్3’ కి కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టాలి. ‘హిట్’ ‘హిట్2’ సినిమాల్లా తక్కువ బడ్జెట్ లో తీస్తే వర్కౌట్ అవ్వదు.

నాని హీరోగా నటించే సినిమాలకు మినిమం రూ.30 కోట్లు బడ్జెట్ పెట్టాలి. అందుకోసమే నాని వెనకడుగు వేస్తున్నట్లు వినికిడి. మరోపక్క శైలేష్ వెంకటేష్ తో ‘సైంధవ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus