నాచురల్ స్టార్ నాని త్వరలోనే హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే నాని తాజాగా ఇండియా టుడే నిర్వహించిన తెలంగాణ రౌండ్ టేబుల్ డిబేట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో రకాల ప్రశ్నలు నానికి ఎదురయ్యాయి. ముఖ్యంగా నేషనల్ అవార్డ్స్ విషయం గురించి నాని చేసిన పోస్ట్ పట్ల ప్రశ్నలు ఎదురయ్యాయి.
తాజాగా నిర్వహించినటువంటి జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినటువంటి పలువురు ఈ అవార్డును అందుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ అవార్డులను ప్రకటించిన తర్వాత నాని సోషల్ మీడియా వేదికగా సూర్య హీరోగా నటించిన జై భీమ్ వంటి సినిమాకు అవార్డు రాకపోవడం బాధాకరం అంటూ ఈయన పోస్ట్ చేశారు అయితే ఇది కాస్త పెద్ద ఎత్తున విమర్శలకు కారణమైంది. తెలుగు సినిమాలకు నేషనల్ అవార్డ్స్ రావడం నాని ఓర్చుకోలేకపోతున్నారు అంటూ పలువురు విమర్శలు చేశారు.
అయితే తాజాగా ఈ పోస్ట్ గురించి నాని (Hero Nani) తెలియజేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు జాతీయ అవార్డులు వచ్చినందుకు ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలిపాను. అలాగే నా బ్రదర్ అల్లు అర్జున్ అలాగే దేవిశ్రీప్రసాద్ కు అవార్డు రావడంతో వారి పేర్లను మెన్షన్ చేసి కూడా మరి తాను విష్ చేసానని తెలిపారు. అయితే నేషనల్ అవార్డు గెలుచుకునే సత్తా ఉన్నటువంటి జై భీమ్ సినిమాకు కూడా వచ్చి ఉంటే బాగుండేదని నా పోస్ట్ ఉద్దేశం అంటూ ఈ సందర్భంగా ఈయన వివరణ ఇచ్చారు.
ఈ సినిమా కూడా జాతీయ అవార్డు అందుకునే సత్తా ఉన్న ఈ సినిమాకు అవార్డు రాకపోవడంతో తాను ఇలాంటి పోస్ట్ చేశానే తప్ప నాకు తెలుగు వారు తక్కువ అనే ఉద్దేశంతో నేను ఈ పోస్ట్ పెట్టలేదని అయితే దీనిని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ ఈ సందర్భంగా నాని జాతీయ అవార్డుల వివాదాస్పద పోస్ట్ గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!