Nani: నాని కూడా ఆ ప్రయత్నం చేయడానికి రెడీ అయ్యాడట..

నేచురల్ స్టార్ నాని ఓ విషయంలో నాగ చైతన్య ని ఫాలో అవ్వడానికి రెడీ అయ్యాడట. వివరాల్లోకి వెళితే.. నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ‘లవ్ స్టోరీ’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో అతను తెలంగాణ కుర్రాడిలా కనిపించబోతున్నాడు. అంతేకాదు తొలిసారి తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడు. ఇందుకోసం అతను ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. విడుదల చేసిన టీజర్లో అతను తెలంగాణ యాసలో మాట్లాడటం మనం చూసాం.

ఇప్పుడు నాగ చైతన్య లానే నాని కూడా ఓ సినిమాలో తెలంగాణ కుర్రాడిలా కనిపించడానికి రెడీ అవుతున్నాడు. అందుకోసం అతను కూడా తెలంగాణలో మాట్లాడేందుకు శిక్షణ తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. నాని నటించిన ‘టక్ జగదీష్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోపక్క రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇవి రెండు పూర్తయ్యాక శ్రీకాంత్ అనే నూతన దర్శకుడితో నాని ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

ఎస్.ఎల్.వి.సి బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని భోగట్టా. లవ్ అండ్ ఫ్యామిలి ఎంటర్టైనర్ గా ఈ చిత్రం కథ ఉండబోతుందని తెలుస్తుంది. స్క్రిప్ట్ మొత్తం పక్కాగా రెడీ అయ్యిందట. షూటింగ్ మొదలైతే 3 నెలల్లో ఈ ప్రాజెక్టుని ఫినిష్ చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నట్టు సమాచారం.కరోనా హడావిడి కనుక లేకపోతే ఈపాటికే షూటింగ్ స్టార్ట్ అయ్యేది అని తెలుస్తుంది.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus