నేచరల్ స్టార్ నాని రాకతో దద్దరిల్లిన బిగ్ బాస్ స్టేజ్..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా స్టార్ట్ అవ్వబోతోంది. ఆదివారం 4గంటల పాటుగా ఇది టెలికాస్ట్ కాబోతోంది. ఇందులో సెలబ్రిటీలు చేసిన హంగామాతో స్టేజ్ దద్దరిల్లబోతోంది. బిగ్ బాస్ సీజన్ 5లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ డ్యాన్స్ పెర్ఫామన్స్ తో స్టేజ్ పైకి వచ్చారు. ఇక ఒక్కొక్కరిగా సాగిన ఎలిమినేషన్ ఉత్కంఠని రేకెత్తిచ్చింది. ముందుగా సుకుమార్ ఇంకా దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరూ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి హౌస్ మేట్స్ కి ఆల్ ద బెస్ట్ చెప్పారు.

ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ టీమ్ నుంచీ హీరో నేచరల్ స్టార్ నాని స్టేజ్ పైకి వచ్చి హౌస్ మేట్స్ ని తనదైన స్టైల్లో పలకరించాడు. బిగ్ బాస్ సీజన్ 2 లో యాంకర్ గా నాని దుమ్మురేపిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల మరోసారి బిగ్ బాస్ షోకి యాంకరింగ్ చేయను అని చెప్పాడు. అయితే, ఇప్పుడు సీజన్ 5లో తన సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగార్జునతో మరోసారి స్టేజ్ ని షేర్ చేస్కున్నాడు.

గతంలో నాగార్జున ఇంకా నాని కలిసి దేవదాస్ సినిమాలో నటించారు. అప్పుడు నాగార్జునని స్టేజ్ పైకి తీస్కుని వచ్చిన నాని, ఇప్పుడు నాగార్జునతో కలిసి స్టేజ్ పైకి సెలబ్రిటీ గా వచ్చి సందడి చేశాడు. ఇక నానితో పాటుగా హీరోయిన్ సాయిపల్లవి కూడా వచ్చి సందడి చేసినట్లుగా సమాచారం. ఇద్దరూ కలిసి హౌస్ మేట్స్ తో ఫన్ చేశారు. మిగతా హౌస్ మేట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పారు.

వీళ్లతో పాటుగా ట్రిబుల్ ఆర్ సినిమా టీమ్, 83 సినిమా టీమ్ కూడా బిగ్ బాస్ స్టేజ్ పైన సందడి చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. అదీ మేటర్.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus