Hero Nani: హిందీపై దృష్టి పెట్టు నాని.. అక్కడ జాగ్రత్త పడాల్సిందే!

నాని (Nani) , కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన దసరా మూవీ మరో 48 గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని నాని భావిస్తున్నారు. 36 సెన్సార్ కట్స్ ద్వారా ఈ సినిమా వార్తల్లో నిలవగా తెలంగాణ స్లాంగ్ అర్థం కాకపోవడం వల్లే ఈ సినిమాకు ఎక్కువగా సెన్సార్ కట్స్ వచ్చాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అదుర్స్ అనే స్థాయిలో ఈ సినిమాకు బుకింగ్స్ జరుగుతుండగా ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దసరా హిందీ వెర్షన్ బుకింగ్స్ ఇంకా మొదలుకాలేదు.

విడుదలకు కొన్ని గంటల ముందు కూడా బుకింగ్స్ ఓపెన్ కాకపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని నాని ఫ్యాన్స్ చెబుతున్నారు. బుకింగ్స్ మొదలుకాకుండా కలెక్షన్లు రావడం ఏ విధంగా సాధ్యమవుతుందని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. నాని బుకింగ్స్ పై దృష్టి పెట్టని పక్షంలో ఇంత కష్టపడి లాభమేంటని అభిమానుల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రమోషన్స్, బుకింగ్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంత కష్టపడినా ఫలితం ఏంటని నెటిజన్లు చెబుతున్నారు.

ముంబై, కోల్ కతా, పూణే, ఢిల్లీలలో దసరా హిందీ బుకింగ్స్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కనీసం నాని నుంచి క్లారిటీ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. భిన్నమైన కథలను ఎంచుకుంటున్న నాని సినిమాకు సంబంధించిన ప్రతి విషయంపై దృష్టి పెడితే మాత్రమే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తాయి. నేను లోకల్ సినిమాతో నాని, కీర్తి సురేష్ సక్సెస్ సాధించగా ఈ సినిమా ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయనుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

అభిమానుల నమ్మకాన్ని నిజం చేసి ఈ సినిమా బాక్సాఫీస్ ను నిజంగానే షేక్ చేస్తుందేమో చూడాలి. న్యాచురల్ స్టార్ నాని క్రేజ్ ను ఈ సినిమా రెట్టింపు చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus