Nani,Nithiin: నితిన్ ను అలా పిలవడంతో నానికి వార్నింగ్.. ఏం జరిగిందంటే?

నాని హీరోగా శౌర్యువ్ డైరెక్షన్ లో తెరకెక్కిన హాయ్ నాన్న సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఫీల్ గుడ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కగా మృణాల్ ఠాకూర్, శృతి హాసన్ హీరోయిన్లుగా నటించారు. శౌర్యువ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో నాని పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే న్యాచురల్ స్టార్ నాని కెరీర్ తొలినాళ్లలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా నాని పని చేసిన సినిమాలలో నితిన్ నటించిన అల్లరి బుల్లోడు సినిమా కూడా ఒకటి.

కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. ఈ సినిమా షూటింగ్ సమయంలో నితిన్ తో నాని ఎక్కువగా మాట్లాడేవారట. ఆ సమయంలో దర్శకనిర్మాతలు హీరోలను బాబు అని పిలిచేవారని నాని మాత్రం నన్ను పేరు పెట్టి పిలిచేవారని అలా పిలవడం నాకు కూడా కంఫర్ట్ గా ఉండేదని నితిన్ అన్నారు.

నన్ను ఎవరైనా బాబు అని పిలిస్తే నచ్చేది కాదని ఆయన కామెంట్లు చేశారు. నాని నితిన్ ను పేరు పెట్టి పిలవడంతో నిర్మాత నానిని పిలిచి హీరోను పేరు పెట్టి పిలవవద్దని చెబుతూ ఒక విధంగా వార్నింగ్ ఇచ్చారు. అయితే నితిన్ మాత్రం నానిని పిలిచి వాళ్లు అలాగే చెబుతారు పట్టించుకోవద్దని సూచించారు. ఆ తర్వాత రోజుల్లో నాని నితిన్ ను “నిత్” అని పిలిచేవారట.

ఈ విధంగా (Nani) నాని, నితిన్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ కానుండగా ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. నితిన్, నానిలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఈ ఇద్దరు హీరోల సినిమాలలో ఏ సినిమా ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus