నేచురల్ స్టార్ నాని (Nani) ఇప్పుడు హీరోగా కాదు, నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నాడు. హిట్ సినిమాలతో దూసుకెళ్తూ, వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూ ఉన్న నాని ప్రస్తుతం హిట్ 3 (HIT3) మూవీతో బిజీగా ఉన్నాడు. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో నాని స్వీయ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు టీజర్‌తోనే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా యాక్షన్, ఇంటెన్సిటీ, బ్రూతల్ టోన్‌తో ప్రేక్షకులను షాక్‌కు గురిచేయబోతుందని నాని పేర్కొన్నాడు.
అయితే, నాని ప్రస్తుతం ఎక్కువగా ఆసక్తి చూపుతున్న ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ (The Paradise) . ‘దసరా’ (Dasara) చిత్రంతో భారీ విజయం అందించిన శ్రీకాంత్ ఓదెలతో (Srikanth Odela) మళ్లీ జత కట్టిన నాని, ఈసారి మరింత బలమైన కథతో, కొత్త లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్యారడైజ్ దసరా కన్నా భారీగా ఉంటుందనీ, సినిమాలో ఊహించని ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండబోతున్నాయని నాని చెప్పాడు. ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నదీ కాక, వచ్చే ఏడాది మార్చి 26న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలన్నది టీమ్ ప్లాన్.
ఈ సినిమా కోసం నాని తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. ప్రస్తుతం షూటింగ్ స్టార్ట్‌కు ముందు మేకోవర్‌పై కష్టపడుతున్నాడు. “ఆడియెన్స్‌కి ఇది పూర్తిగా సర్‌ప్రైజ్‌గా ఉంటుంది. ప్యారడైజ్‌లో ఉన్న ఎనర్జీ, విజన్, ఎమోషన్స్ అన్నీ కొత్త స్థాయిలో ఉంటాయి” అంటూ నాని వివరించాడు. రా స్టేట్‌మెంట్ వీడియో ద్వారా వచ్చిన పాజిటివ్ బజ్ ఈ సినిమాపై అంచనాలను మరోసారి పెంచింది. ఇదే ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) తాను నిర్మించబోయే సినిమా గురించి కూడా నాని స్పందించాడు.
నిర్మాతగా చిరుతో సినిమా చేయడం తనకు కలలాంటిదని, ఇది పెద్ద బాధ్యతగా భావిస్తున్నానని చెప్పాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో రూపొందబోయే ఈ ప్రాజెక్ట్ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని చెప్పాడు. “శ్రీకాంత్ గారు చిరంజీవిపై ఉన్న అభిమానం ఈ సినిమాలో కనిపిస్తుంది” అంటూ నాని వివరించాడు. ఈ మూవీకి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) మ్యూజిక్ అందించబోతున్నాడన్నది మరో క్రేజీ అప్డేట్. మొత్తానికి హీరోగా, నిర్మాతగా నాని పాన్ ఇండియా స్థాయిలో తన పట్టు చూపించడానికి రెడీ అవుతున్నాడు.