నేచురల్ స్టార్ నాని కి ముద్దు అంటే చేదు ఎందుకు ?

హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న సహజ నటుడు నాని “మజ్ను”తో మరోసారి నవ్వించారు. నేడు విడుదలయిన ఈ సినిమాతో రెండో హ్యాట్రిక్ ని మొదలు పెట్టారు. ఉయ్యాలా జంపాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సరదాగా సాగిపోతు యువతకు బాగా నచ్చింది. ఈమూవీ ప్రమోషన్లో భాగంగా నాని పలు ఆసక్తికర సంగతులు వెల్లడించారు.

తాను లిప్ లాక్ సీన్లకు దూరమని స్పష్టం చేశారు. ఎందుకని ప్రశ్నిస్తే.. “నేను నటించిన సినిమాల్లో ఒకే ఒక దాంట్లో ముద్దు సీన్ ఉంది. అది “అహనా పెళ్లంట” సినిమాలో హీరోయిన్ వాణి కపూర్ పెదాలపై ముద్దు పెడతాను. ఆ సీన్ చూసిన నా భార్య (అంజన) చాలా కోప్పడింది. అందుకే ఇక ముద్దు సీన్లో నటించకూడదని నిర్ణయించుకున్నాను” అని నాని చెప్పారు.

అంజనను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ యువ హీరోని .. మీ లవ్ స్టోరీ గురించి చెప్పమని కోరగా.. “అది పర్సనల్ ” అంటూ చెప్పకుండా దాటవేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus