కొన్ని సినిమాలు చూస్తే… తెలియని పులకరింత వచ్చేస్తుంది. మనం ఎక్కడున్నాం అనేది మరచిపోయి మరీ మనం అనుకున్నది చేసేస్తుంటాం. ఇప్పుడు ‘హాయ్ నాన్న’ సినిమా చూస్తే కొంతమంది ప్రేక్షకులు అచ్చంగా ఇలానే అనుకుంటున్నారట. సోషల్ మీడియాలో మేజర్ కామెంట్స్ చూసి చెబుతున్న మాట ఇది. ఇదంతా నాని అభిమానులు, సీత అలియాస్ మృణాల్ ఠాకూర్ అభిమానుల మాటలు. మరి నాని భార్య అంజనా ఏం చెప్పింది.ఇదిగో ఈ అందమైన మాటల్ని మూట కట్టి ఓ ట్వీట్ చేసింది.
దీంతో ఆ విషయాలు వైరల్ అయ్యాయి. నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం (Hi Nanna) ‘హాయ్ నాన్న’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చూసిన తర్వాత నాని భార్య అంజన ఆసక్తికర పోస్ట్ పెట్టారు. నాని తన కుమారుడితో కలిసి సినిమా చూస్తోన్న ఫొటో షేర్ చేసి ఆసక్తికర కామెంట్ రాసుకొచ్చారు. ‘ఈ సినిమా చూసిన అందరికీ.. వాళ్లకు ఇష్టమైన వారిని హత్తుకోవాలనిపిస్తుంది’ అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు అంజన.
ఇక తన భర్త గురించి చెబుతూ… నాన్న పాత్రలో నాని ఒదిగిపోయాడు. సినిమా చూస్తున్నంతసేపు నాకు మా నాన్న గుర్తొకొచ్చారు అని పోస్టులో రాసుకొచ్చారు అంజన. దీంతో ఆ పోస్టులకు వేలల్లో లైక్‌లు, వరుస కామెంట్లు కనిపిస్తున్నాయి. సినిమా కథ విషయానికొస్తే… విరాజ్ (నాని) ముంబయిలో ఓ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. పుట్టినప్పటి నుంచే జబ్బుతో బాధపడుతున్న తన కూతురు మహీ (కియారా) ప్రపంచంగా బతుకుతుంటాడు.
ఓ రోజు అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. కథ చెప్పకుండ తండ్రి మాట దాటేయడంతో మహీ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు ఓ ప్రమాదం కారణంగా మహీ, యష్ణ (మృణాల్) స్నేహితులు అవుతారు. ఆ తర్వాత ఏమైంది.. ఆ తండ్రీ కూతుళ్లకు, యష్ణకు సంబంధం ఏంటి అనేది సినిమా.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!