టాలీవుడ్ హీరోలు – రాజకీయాలు.. బాగా ఇబ్బంది పెట్టే కాంబినేషన్ ఇది. సినిమాలు చేసుకుంటూ రాజకీయాల గురించి మాట్లాడితే ఓ వర్గం ప్రజలు లేక ఓ పార్టీ వ్యక్తుల నుండి నిరసన, ట్రోలింగ్ ఎదురవుతుంది. గత కొన్నేళ్లుగా తెలుగు రాజకీయాలు చూస్తే ఈ విషయం ఇట్టే చెప్పేస్తారు. ఇప్పుడు నిఖిల్ కూడా దీనికి భయపడే రాజకీయాల గురించి యూటర్న్ తీసుకున్నారా? అదేంటి నిఖిల్ రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చాడు అని అనుకుంటున్నారా? ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు కానీ గతంలో పాలిటిక్స్ వైబ్‌లో అయితే ఉన్నాడు.
నిఖిల్ పాలిటిక్స్ గురించి క్లారిటీగా కావాలంటే.. ఓ ఎనిమిదేళ్ల వెనక్కి వెళ్లాలి. వైసీపీ తరుపున 2014లో నిఖిల్ ప్రచారం చేశాడు. అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కాదు కానీ.. పెందుర్తి నియోజక వర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అన్నం రెడ్డి అదీప్ రాజ్‌కి మద్దతుగా నిఖిల్ ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో అదీప్ రాజ్ భారీ మెజార్టీతో గెలిచారు కూడా. అంతేకాదు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ జనసేనలో ఉన్నప్పుడు ఆయనకు సపోర్ట్ చేశారు.
ఆ తర్వాత సికింద్రబాద్ నియోజకవర్గం నుండి ఎంపీగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్ పోటీ చేసినప్పుడు నిఖిల్ ప్రచారం చేశాడు. అంతకుముందు టీడీపీకి కూడా నిఖిల్ మద్దతుగా నిలిచిన సందర్భాలున్నాయి. ఏపీలో పవన్ కల్యాణ్ జనసేన పెట్టినప్పుడు ఆయనకు వంద సీట్లు రావాలని ఆకాంక్షించాడు కూడా. అయితే ఇప్పుడు ఏమైందే ఏమో ‘‘నాకు ఏ పార్టీ లేదు. పాలిటిక్స్ అంతకంటే లేదు. నాకు తెలిసిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా సపోర్ట్ చేస్తాను.
నేను యాక్టర్‌ని.. నాకు తెలిసింది సినిమాలే’ అని అన్నాడు నిఖిల్. ఆ లెక్కన పాలిటిక్స్‌తో ఇన్నాళ్లూ టచ్‌లోనే ఉన్న నిఖిల్ ఇప్పుడు ఏకంగా నాకు తెలిసింది సినిమాలే అంటూ క్లారిటీ ఇవ్వడం వెనుక ఏమై ఉండొచ్చు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజకీయ లెక్కల్లో ఎందుకు తలదూర్చడం అనుకున్నాడో ఏమో.. ఇలా యూటర్న్ తీసేసుకున్నాడు. కెరీర్ ముఖ్యం నిఖిలూ.. ఎవరన్నా అన్నారేమో.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?