Nikhil: వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్నా.. హీరో కామెంట్స్!

Advertisement

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినిమా ఇండస్ట్రీపై కూడా దీని ప్రభావం ఉంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే థియేటర్లను మూసివేశారు. సినిమా షూటింగ్ లు కూడా ఆగిపోతున్నాయి. దీంతో మన తారలు మరోసారి పూర్తిస్థాయిలో ఇంటికి పరిమితమయ్యారు. ఈ క్రమంలో హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గే వరకు తన కుటుంబం మొత్తం లాక్ డౌన్ లో ఉంటుందని అతడు తెలిపాడు. నిఖిల్ ప్రస్తుతం ’18 పేజెస్’, ‘కార్తికేయ 2’ చిత్రాల్లో నటిస్తున్నాడు.

అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల షూటింగ్ లను ఆపేశామని నిఖిల్ చెప్పాడు. ఇండస్ట్రీలో కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోయిందని.. ప్రతీ ఒక్కరూ తమ మిత్రుడికో లేక బందువుకో కరోనా సోకిందని చెబుతున్నారని.. దీంతో తమ సినిమాల షూటింగ్ ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని చెప్పుకొచ్చాడు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత షూటింగ్ మొదలుపెడతామని పేర్కొన్నాడు. తన భార్య పల్లవితో కలిసి అన్ని జాగ్రత్తల మధ్య సెల్ఫ్ లాక్ డౌన్ లోకి వెళ్లామని నిఖిల్ చెప్పాడు.

ఎంతో మంది యువకులు ఈ వైరస్ బారిన పడుతున్నారని.. తనకు తెలిసిన వ్యక్తి ఒకరు వైరస్ సోకి మరణించాడని.. అతడి వయసు కేవలం 31 ఏళ్లే అని ఎమోషనల్ అయ్యాడు. ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. తన భార్య డాక్టర్ కావడంతో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాడని.. తను కూడా వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు నిఖిల్. ఈ లాక్ డౌన్ లో కష్టాల్లో ఉన్నవారికి తగిన సహాయం అందించడానికి అన్ని విధాలా కృషి చేస్తానని స్పష్టం చేశాడు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus