Nikhil: రాజకీయాల్లోకి నిఖిల్ అంటూ ప్రచారం.. అసలు నిజాలివే!

టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నిఖిల్ (Nikhil Siddhartha) ప్రస్తుతం వరుస విజయాలతో జోరుమీదున్నారు. స్పై సినిమా నిరాశపరిచినా నిఖిల్ కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం స్వయంభూ సినిమాలో నిఖిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా భారీ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే నిఖిల్ టీడీపీలో చేరినట్టు వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

నిఖిల్ మామయ్య కొండయ్య యాదవ్ కు టీడీపీ టికెట్ కేటాయించిన నేపథ్యంలో నిఖిల్ టీడీపీ కండువా కప్పుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే నిఖిల్ పీఆర్ టీమ్ మాత్రం నిఖిల్ టీడీపీలో చేరలేదని కేవలం మద్దతు మాత్రమే ఇచ్చారని వెల్లడించారు. 2019 సంవత్సరంలో కూడా నిఖిల్ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయడం గమనార్హం.

అయితే నిఖిల్ కెరీర్ పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలో రాజకీయాలపై ఫోకస్ పెట్టే చాన్స్ అయితే లేదు. స్వయంభూ సినిమాలో నిఖిల్ వారియర్ గా కనిపించనుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి స్పష్టత రావాల్సి ఉంది. కార్తికేయ2 (Karthikeya 2) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన నిఖిల్ తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాల్సి ఉంది. స్వయంభూ (Swayambhu) సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

నిఖిల్ భవిష్యత్తులో మాత్రం పాలిటిక్స్ లోకి పూర్తిస్థాయిలో ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నిఖిల్ రెమ్యునరేషన్ 14 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. నిఖిల్ వరుస విజయాలు సాధించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుండగా రాబోయే రోజుల్లో ఆయనకు ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus