ఇంత సడెన్ గా.. ఇంత సింపుల్ గా.. నిఖిల్ పెళ్ళా?

ఈ ఏడాది యంగ్ హీరో నిఖిల్ పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. డాక్టర్ అయిన పల్లవి వర్మతో నిఖిల్ చాలా కాలం నుండీ ప్రేమలో ఉన్నాడు. ఈ విషయాన్ని అతనే మీడియా వారికి అలాగే సోషల్ మీడియాలో కూడా తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు లాక్ డౌన్ వల్ల.. అనేక నియమాలతో పెళ్ళి చేసుకోవడం అవసరమా అని పోస్ట్ పోన్ చేసుకున్నట్టు తెలిపాడు. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తూనే.. లాక్ డౌన్ ఇప్పట్లో ముగిసేలా లేదు.

ఇక మంచి ముహుర్తాలు కూడా మిస్ అయిపోతున్నాయి.. అందులోనూ వీరివురి జాతకాల ప్రకారం.. వీరి పెళ్ళికి రేపే ముహూర్తం కుదిరింది అని తెలుస్తుంది. అందుకే అతి తక్కువ మంది సమక్షంలో నిఖిల్ పెళ్ళి జరుగబోతున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లోని నగర శివార్లలో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో ఈ పెళ్ళి జరుగనుందని తెలుస్తుంది. నిఖిల్, పల్లవి ఇంటి సభ్యులు కూడా ఇందుకు అంగీకరించినట్టు తెలుస్తుంది. ఈరోజు ఉదయం పల్లవిని పెళ్ళి కూతుర్ని చేస్తున్నారట.

సాయంత్రం నిఖిల్ ను పెళ్ళికొడుకుని చేస్తారట. లాక్ డౌన్ నియమాలను ఏమాత్రం ఉల్లంఘించకుండా.. అతి తక్కువ మంది సంపక్షంలోనే పెళ్ళి ఉంటుందట. సానిటైజెర్లు.. వంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. ఏమైనా ఎంతో ఘనంగా నిఖిల్ పెళ్ళి వేడుక ఉంటుంది అనుకుంటే.. ఇంత సింపుల్ గా చెయ్యాల్సి వస్తుంది అని మరోపక్క వారి బంధువులు, సన్నిహితులు కొంత నిరాశ చెందుతున్నారట.

1

2

3

 

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus