Nikhil: నాలుగు సినిమాలతో నిఖిల్ రెడీ!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నుంచి వరుస సినిమాలు విడుదల కాబోతున్నాయి. ప్రస్తుతం ఈ హీరో చేతుల్లో నాలుగు సినిమాలు ఉన్నాయి. వీటన్నింటికీ సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. వచ్చే నెలలో ‘కార్తికేయ 2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నిఖిల్. ఆ తరువాత అతడు నటించిన ’18 పేజెస్’ సినిమా విడుదల కానుంది. సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదలవుతుంది. అలానే ఎడిటర్ గ్యారీ దర్శకత్వంలో ‘స్పై’ అనే సినిమా చేస్తున్నారు నిఖిల్.

ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. దీంతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ కి తీసుకొచ్చారు. ఇంకా ఈ సినిమాకి టైటిల్ పెట్టలేదు. ఇలా నాలుగు సినిమాలను రెడీ చేశారు. నెలల గ్యాప్ లోనే ఈ సినిమాలను ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అలానే నెక్స్ట్ సినిమాపై కూడా దృష్టి పెడుతున్నారు. చందు మొండేటితోనే మరో సినిమా చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు.

ఆ ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఇద్దరి మధ్య స్క్రిప్ట్ డిస్కషన్ కూడా జరిగింది. నిఖిల్ డేట్స్ ఖాళీ అవ్వగానే ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. అలానే మరికొందరు దర్శకులు నిఖిల్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఓ డెబ్యూ డైరెక్టర్ తో కూడా నిఖిల్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి నిఖిల్ నుంచి వస్తోన్న నాలుగు సినిమాలు మంచి సక్సెస్ అయితే గనుక నిఖిల్ రేంజ్ పెరిగిపోవడం ఖాయం.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus