Extra Ordinary Man: ‘ఎక్స్ట్రా’ విషయంలో నితిన్ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉందిగా..!

‘భీష్మ’ తర్వాత నితిన్ ఖాతాలో సరైన సక్సెస్ పడలేదు. ‘చెక్’ ‘మాచర్ల నియోజకవర్గం’ వంటి సినిమాలు బాగా నిరాశపరిచాయి. ‘రంగ్ దే’ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకోగా ‘మాస్ట్రో’ ఓటీటీకి వెళ్ళింది. సో ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నితిన్. వక్కంతం వంశీ ఈ చిత్రానికి దర్శకుడు. ‘నా పేరు సూర్య’ తో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీకి కూడా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ విజయం ఎంతో కీలకంగా మారింది.

ఇక శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘శ్రేష్ఠ్ మూవీస్’, ‘రుచిర ఎంటర్టైన్మెంట్స్’, ‘ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్’ బ్యానర్ల పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. డిసెంబర్‌ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నితిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

నితిన్ మాట్లాడుతూ.. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నా కెరీర్లో ఇప్పటివరకు నేను ఇలాంటి రోల్ ఎప్పుడూ చేయలేదు. అందుకు దర్శకుడు వక్కంతం వంశీకి థాంక్స్ చెప్పుకోవాలి. ఖ్యాతి, రిత్విక్ పాత్రలతో అంతా ప్రేమలో పడతారు. ప్రతి పాత్రకు ఇందులో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. రాజశేఖర్ గారు చేసిన ‘మగాడు’ సినిమాతో మా నాన్నగారు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టారు. ఆ సినిమా హిట్ అయ్యింది కాబట్టే మా నాన్న ఇండస్ట్రీలో ఉన్నారు.

ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టే నేను హీరో అవ్వాలనే ఆశయంతో ఇలా మీ ముందుకు వచ్చాను. ఇలా నిలబడగలిగాను. కాబట్టి నేను హీరో అవ్వడానికి రాజశేఖర్ కూడా ఓ కారణమని చెప్పాలి. ఈరోజు ఆయన నా సినిమాలో స్పెషల్ రోల్ చేసినందుకు కూడా ఆయనకి థాంక్స్ చెబుతున్నాను. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ‘ఎక్స్ట్రా’ ఆయనకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. హారిస్ జైరాజ్ గారి మ్యూజిక్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

డీఓపీ యువరాజ్‌ కి నన్ను ఎలా చూపించాలో బాగా తెలుసు. ఆయనతో 3 సినిమాలు చేశాను. శ్రీలీల ఎంత బిజీగా ఉన్నా కూడా మా సినిమాకి డేట్స్ ఇవ్వడం ఆనందంగా ఉంది. నాకు, నా దర్శకుడికి ఈ సినిమా చాలా ముఖ్యం. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. నిర్మాతలకు లాభాలు రావాలి.ఒక్కటైతే కాన్ఫిడెంట్ గా చెబుతాను.

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా చూసి నా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని థియేటర్ నుండి బయటకు వస్తారు. డిసెంబర్ 8న గట్టిగా కొట్టబోతోన్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇన్సైడ్ సర్కిల్స్ కూడా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ కి పాజిటివ్ టాక్ చెబుతున్నారు. కాబట్టి నితిన్ కి ఈసారి సాలిడ్ హిట్ దక్కే అవకాశం ఉన్నట్టే కనిపిస్తుంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus