Nithiin: ప్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తున్నాడా..?

ఈ ఏడాదిలో నితిన్ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ‘చెక్’ సినిమాకి ప్లాప్ టాక్ రాగా.. ‘రంగ్ దే’ సినిమా ఏవరేజ్ టాక్ తో థియేటర్లలో నడుస్తోంది. ప్రస్తుతం ఈ హీరో ‘మాస్ట్రో’ అనే సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్ లో సక్సెస్ అయిన ‘అంధాధూన్’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాటు నితిన్ మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా దర్శకుడు వక్కంతం వంశీ.. నితిన్ ని కలిసి కథ వినిపించినట్లు తెలుస్తోంది.

‘నా పేరు సూర్య’ సినిమా ఫెయిల్ అవ్వడంతో వక్కంతం వంశీ కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటున్నాడు. ఇప్పటివరకు దర్శకుడిగా తన తదుపరి సినిమా మొదలుపెట్టలేదు. నితిన్ ని హీరోగా పెట్టి సినిమా చేయాలనుకుంటున్న వంశీ అతడిని కలిసి సినిమాకి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. అలానే మరో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా నితిన్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు. నిజానికి ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలి కానీ ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడినట్లు తెలుస్తోంది.

దీంతో సురేందర్ రెడ్డి తన తదుపరి సినిమా నితిన్ తో చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు అఖిల్ సినిమా కోసం పని చేస్తున్నాడు. అది పూర్తయిన తరువాత నితిన్ తో సినిమా ఉండే ఛాన్స్ ఉంది. వక్కంతం వంశీ, సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయబోయే సినిమాలను నితిన్ తన సొంత బ్యానర్ లోనే నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ రెండు కథలు డిఫరెంట్ కాన్సెప్ట్స్ కావడంతో కచ్చితంగా ఈ సినిమాలతో తన క్రేజ్ పెరుగుతుందని నితిన్ నమ్ముతున్నాడు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus