Vamsi Paidipally: వంశీ పైడిపల్లి హీరోలు దొరకడం లేదా?

ఇప్పుడు స్టార్ హీరోలు పెద్ద ప్రాజెక్టుల్లో లాక్ అయిపోయారు. మిడ్ రేంజ్ హీరోలు కూడా రెండు, మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో స్టార్ డైరెక్టర్లకి హీరోలు దొరకడంగానే కష్టంగా ఉంది. దీంతో కొన్ని చిన్న సినిమాలకి రైటర్ అంటూ తమ పేర్లు వేసుకుని దర్శకత్వ పర్యవేక్షణ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ సినిమా ఆడితే వారికి పేరొస్తుంది. ప్లాప్ అయితే డైరెక్టర్ అకౌంట్లో పడుతుంది. ఏదేమైనా వారి పారితోషికం అయితే వారికి వచ్చేస్తుంది.

అయితే ఇంకొంతమంది దర్శకులు మాత్రం పరభాషా హీరోలకి కథలు చెప్పి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఆ లిస్ట్ లో ఒకడు అని చెప్పాలి. తెలుగులో ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్, మహేష్ బాబు, నాగార్జున వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన వంశీ పైడిపల్లి.. విజయ్ తో వారసుడు అనే సినిమా చేశాడు.అది తమిళంలో బాగానే ఆడింది. తెలుగులో కూడా పర్వాలేదు అనిపించింది.

ఆ సినిమా రిలీజ్ అయ్యి 10 నెలలు కావస్తున్నా.. వంశీ పైడిపల్లి నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. చరణ్ , ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి వారికి కథలు చెప్పాడు. కానీ ఏదీ కూడా ఓకే అవ్వలేదు. అతను చిన్న లేదా మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసే రకంగా కూడా కాదు. నాకు పెద్ద హీరోనే కావాలి అని ఎన్నేళ్ళైనా వెయిట్ చేసే రకం.

అందుకే తెలుగులో కాకపోయినా తమిళంలో అయినా పెద్ద హీరోని పట్టాలని అతను ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో మళ్ళీ విజయ్ కి కథ చెప్పాడు. ‘వారిసు’ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కాబట్టి విజయ్ పాజిటివ్ గానే స్పందించాడు. అలాగే (Vamsi Paidipally) వంశీ పైడిపల్లితో సినిమా అంటే అక్కడి హీరోలు కూడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus