చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడైతే తను కోల్పోయింది అమ్మనే కాదు జీవితంలో వెలకట్టలేని అమ్మ ప్రేమను అని తెలుసుకొని అమ్మ ప్రేమను,అమ్మాయి ప్రేమకు ముడిపెడుతూ ఒక మతాంతర ప్రేమకథ ఇతివృత్తంగా తెరకెక్కించిన చిత్రమే “రాజ్ కహానీ”. భార్గవి క్రియేషన్స్ పతాకంపై రాజ్ కార్తికేన్,చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి, నటీనటులు గా రాజ్ కార్తికేన్ టైటిల్ రోల్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భాస్కర రాజు, ధార్మికన్ రాజు లు సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చగా యస్.యస్.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్చి 24 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సంధర్భంగా చిత్రయూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది..ఈ కార్యక్రమానికి నిర్మాత రమేష్ పుప్పాల,ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసి రెడ్డి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, లయన్ సాయి వెంకట్, తదితరులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి మాట్లాడుతూ..చిన్న సినిమా అయినా కథలో మంచి కంటెంట్ ఉంటే ఆ సినిమా బిగ్ హిట్ అవుతుంది. అలాంటి మంచి కంటెంట్ తో వచ్చిన ఈ రాజ్ కహాని సినిమాను మనమందరం ప్రోత్సహించి బిగ్ హిట్ చెయ్యాలి. ఇలాంటి మంచి సినిమాలను ప్రోత్సహిస్తే ఇంకా మంచి చిత్రాలు తీస్తారు. ఎంతో కష్టపడి మంచి సినిమా తీసిన చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.
నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ…ఈ సినిమా చూశాను. చాలా బాగుంది.అమ్మ ప్రేమను అమ్మాయి ప్రేమకు ముడిపెడుతూ పక్కా కమర్షియల్ హంగులతో చాలా చక్కగా తెరకెక్కించారు దర్శక, నిర్మాతలు. తల్లి, కొడుకు మధ్య ఏమోషన్స్ తో చాలా బాగుంది. చక్కటి కథను సెలెక్ట్ చేసుకొని తీసిన చిత్ర దర్శకుడు ఫ్యూచర్ లో గొప్ప దర్శకుడు అవుతాడనే నమ్మకం ఉంది అన్నారు.
ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..
సినిమాకు ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా ఈ సినిమా తీశాడు. మంచి కాన్సెప్ట్ తీసుకొని చేసిన ఈ సినిమాకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీ గా ఉంది. కరీంనగర్ లోని తిరుమల థియేటర్ లో వరుసగా ఏడవ రోజు కూడా హౌస్ ఫుల్ గా రన్ అవ్వడం చాలా మంచి విషయం. ఇలాగే వీరు ముందు ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి కొత్త దర్శక, నిర్మాతలు తీసిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తే వారు ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీస్తారు. కాబట్టి ఈ రాజ్ కహానీ సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ..మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మహిళా ప్రేక్షకాధారణ లభించడం చాలా హ్యాపీ గా ఉంది. ఈ చిత్ర దర్శక, నిర్మాతలు ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తియాలని కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర దర్శకులు, హీరో రాజ్ కార్తికేన్ మాట్లాడుతూ..మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన నేను నా చిన్నప్పుడు సినిమా చూడడానికే ఎంతో ఇబ్బంది పడేవాన్ని, ఆ తరువాత అమ్మ ప్రేమను అంతర్లీనంగా, అమ్మాయి ప్రేమను బాహ్యవలయంగా చేసుకుని అసలైన ప్రేమకు అర్థం చెప్పే ఒక మంచి కథ రాసుకొని గత రెండు సంవత్సరాలుగా ఎంతోమంది నిర్మాతలకు ఈ కథను వినిపించడం జరిగింది. ఎవరూ తీయడానికి ముందుకు రాకపోవడంతో చివరకు నేనే ఈ సినిమా తీద్దామని ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్ తో స్టార్ట్ చేశాము. మేము స్టార్ట్ చేసిన కొంత కాలానికి కరోనా రావడం, ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా వాటిని ఓవర్ కం చేసుకొని మా సినిమాలో ఉండే కంటెంట్ ను నమ్మకంతో ఈ కథను ప్రేక్షకులకు చేరువ చెయ్యాలనే ఉద్దేశంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మా సినిమాను పెద్దలకు ప్రివ్యూ వేయడంతో సినిమా చాలా బాగుందని అందరూ మమ్మల్ని బ్లెస్ చేసి మాకు ధైర్యం చెప్పడంతో మాకు ఎంతో ధైర్యం వచ్చింది. మాకు ఈ సినిమాను విడుదల చేసే స్తోమత లేకున్నా మేము ఓన్ గా సినిమా రిలీజ్ చేశాము. కరీంనగర్ లోని తిరుమల థియేటర్ లో వరుసగా ఏడవ రోజు కూడా హౌస్ ఫుల్ గా రన్ అవ్వడమే కాకుండా చూసిన ప్రేక్షకులందరూ చాలా బాగుందని చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మహిళలు అందరూ తల్లి కొడుకుల సెంటిమెంట్ బాగుందని చెప్పడం మాకు చాలా సంతోషం కలిగించింది. అక్కడే సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది. ఇంకా చూడని వారు ఉంటే అందరూ మా “రాజ్ కహాని” సినిమాను చూసి బ్లెస్ చేయాలని కోరుతూ మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర నిర్మాతలు భాస్కర రాజు, ధార్మికన్ రాజులు మాట్లాడుతూ.. ఇది మా మొదటి చిత్రం. నేను సాఫ్ట్ వేర్ ఎంప్లాయిని అయినా మేము చాలా కష్టపడి తీశాము. మా సినిమాను బ్లెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇలాగే మేము ఇక ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలు తీస్తాము అని అన్నారు.
జబర్దస్త్ ఫణి మాట్లాడుతూ.. ఒక చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఏడవ రోజు కూడా థియేటర్ హౌస్ ఫుల్ అయ్యింది. ఇలాంటి మంచి కంటెంట్ తో తీసిన ఈ సినిమా ఇంకా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నటుడు మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఇందులో నేను హీరోయిన్ తండ్రి గా నటించాను. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.ఇందులో మూడు మతాలను చాలా బాగా చూయించారు.