మరీ భారీ స్థాయి స్టార్ డమ్ సాధించకపోయినా.. నటించిన కొన్ని సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుని, యువ హీరోగా తనకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు రాజా. శ్రీకాంత్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేసాడు. మరో ఉదయ్ కిరణ్ లా అవుతాడు అనుకున్నారు అందరూ. అయితే.. అందరూ యువ హీరోల్లాగే రాజా కూడా మాస్ హీరో ఇమేజ్ కోసం వెంపర్లాడాడు. దాంతో ఉన్నదీ పోయింది, ఉంచుకున్నదీ పోయింది అన్నట్లు హీరోగా ప్రాభవం కోల్పోయాడు.
తర్వాత కొన్నాళ్లపాటు కనిపించలేదు. “మిస్టర్ నోకియా” సినిమాలో విలన్ గా ఆఖరిసారి కనిపించాడు రాజా. ఆ తర్వాత మాయమైపోయి.. సడన్ గా ఎదో చర్చ్ లో ప్రార్ధనలు చేస్తూ కనిపించిన రాజాను చూసి షాక్ అయ్యారు సినిమా జనాలు. ఆ తర్వాత తెలిసింది ఆయన పాస్టర్ గా మారిపోయాడని. మధ్యలో పొలిటికల్ గానూ పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేసి వైరలయ్యాడు. అయితే.. రీసెంట్ గా రాజా ఓ మీడియా హౌజ్ కి ఇంటర్వ్యూ ఇస్తూ మళ్ళీ సినిమాల్లోకి వస్తారా అనే ప్రశ్నకి సమాధానముగా “అసలు ఆ ఆలోచన లేదు,
పొరపాటున కూడా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లేదు” అని తేల్చి చెప్పేసాడు రాజా. మరి మాట మీద కుర్చీ వేసుకుని మరీ కూర్చున్న రాజా ఎందుకలా ఇండస్ట్రీ మీద కోపం పెంచుకున్నాడో చెబితే చూడాలి.