Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

సీనియర్‌ నటుడు, ఇటీవల యాంగ్రీ స్టార్‌గా మారిన రాజశేఖర్‌ ఇటీవల షూటింగ్‌లో గాయపడ్డారు. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. సర్జరీ పూర్తయ్యాక ఆయన టీమ్‌ ఈ మేరకు మీడియాకు తెలియజేసింది. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల వెండితెరపైకి వచ్చిన రాజశేఖర్ కొత్త సినిమా షూటింగ్‌లో గాయపడ్డారట. ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘లబ్బర్‌ పందు’ రీమేక్‌ సినిమాలో ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో కాలికి తీవ్ర గాయమైనట్లు టీమ్‌ తెలియజేసింది. సర్జరీ తర్వాత కోలుకుంటున్నారని టీమ్‌ తెలిపింది.

Rajashekhar

నవంబర్ 25న మేడ్చల్‌లో జరిగిన యాక్షన్ సన్నివేశం చిత్రీకరణలో రాజశేఖర్‌ గాయపడ్డారట. కుడి చీలమండ బైమలియోలార్ డిస్‌లోకేషన్ అయింది. అలాగే కాంపౌండ్ ఫ్రాక్చర్‌ కూడా అయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా టెస్టులు చేసి వైద్యులు ఆపరేషన్‌ అవసరమని చెప్పడంతో డిసెంబర్ 8న సర్జరీ పూర్తి చేశారు. ఈ సర్జరీ మూడు గంటలపాటు జరిగిందని సమాచారం. మూడు నుండి నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

ఇక గతంలో కూడా రాజశేఖర్‌ షూటింగ్‌ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. నవంబర్ 15, 1989న తొలిసారి ‘మగాడు’ సినిమా ఇలాంటి గాయమే ఎడమ కాలికి అయింది. ఇప్పుడు కూడా అదే నవంబర్‌లో మరోసారి గాయపడ్డారు. సినిమాల విషయానికొస్తే.. శర్వాంద్‌ ‘బైకర్‌’ సినిమాలో రాజశేఖర్‌ నటించారు. మరో రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఓ నెల రోజులు రెస్ట్‌ తీసుకున్నాక జనవరి నుండి రాజశేఖర్‌ తిరిగి షూటింగుల్లో పాల్గొంటారని సమాచారం.

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus