సినిమా అంటే నాలుగు ఫైట్లు.. ఆరు పాటలు.. అనే ఫార్ములాని నేటి హీరోలు పక్కన పెడుతున్నారు. వినూత్న కథల్లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా యువ హీరో రామ్ విభిన్న పాత్రలో నటించడానికి అంగీకరించాడు. అతని గత చిత్రం “నేను శైలజ” విజయం సాధించింది. ఆ ఉత్సాహం లో విరంచి వర్మ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రం సగం వరకు పూర్తి అయిపోయింది. కొత్త సినిమా సెట్ మీద ఉండగానే రామ్ నెక్స్ట్ ప్రాజక్ట్ ని ఒకే చేసాడు. కామెడీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తెరకెక్కించే అనిల్ రావిపూడి చెప్పిన స్టోరీ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన సుప్రీమ్ సినిమా యాభై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రామ్ తో సినిమా చేయనున్నట్లు అతనే స్వయంగా ప్రకటించాడు.
అయితే ఇందులో రామ్ అంధుడి పాత్రలో నటించనున్నాడని చెప్పి చర్చకు తెరలేపాడు. అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కానని పోస్ట్ చేసాడు. మాస్, క్లాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న రామ్ అంధుడి పాత్ర అయినా ఒకే చేసాడంటే.. కథలో మంచి బలం, ట్విస్ట్ ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.