Hero Ram: ‘రామ్.. నువ్వు హాలీవుడ్ హీరోవి’ అంటున్న బండ్ల గణేష్..!

ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని కొంత గ్యాప్ తర్వాత పబ్లిక్‌లో కనిపించాడు.. రీసెంట్‌గా.. స్టైలిష్ అండ్ కిరాక్ లుక్‌లో కనిపించి.. ఫ్యాన్స్, ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేశాడు.. ట్రెండీ కాస్ట్యూమ్స్, గాగుల్స్, గడ్డంతో రగ్డ్ లుక్‌తో అదిరిపోయాడు.. ఓ క్లాతింగ్ షోరూమ్ ఓపెన్ చేయడానికి హోమ్ టౌన్ విజయవాడ వచ్చాడు.. అక్కడ మనోడి క్రేజ్ మామూలుగా లేదసలు.. తనను చూడ్డానికి ఫ్యాన్స్, బెజవాడ జనాలు పెద్ద ఎత్తున వచ్చారు..

రామ్ వేసుకున్న షర్ట్, షూస్ కాస్ట్ గురించిన న్యూస్ వైరల్ అవడం చూశాం.. ఇప్పుడు రామ్ పోస్ట్ చేసిన నాలుగు ఫోటోలు ఫ్యాన్స్, నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.. ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే రామ్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటాడు..రామ్ డిఫరెంట్ లుక్‌లో ఉన్న యానిమేటెడ్ ఇమేజెస్ తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌ ద్వారా పంచుకున్నాడు.. ‘వీటిలో ఏది మీ ఫేవరెట్?’.. అని అడిగాడు.. దీనికి నెటిజన్ల నుండి, అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది..

అందరూ.. అన్ని పిక్స్ బాగున్నాయంటూ రిప్లై ఇస్తున్నారు.. డైహార్డ్ లేడీ ఫ్యాన్స్ అయితే.. ‘రామ్, నన్ను పెళ్లి చేసుకో.. నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.. నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ‘హాలీవుడ్ హీరోలా ఉన్నావ్’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ట్విట్టర్‌లో 2.8 మిలియన్స్.. ఇన్‌స్టాగ్రామ్‌లో 3.5 మిలియన్ల మంది రామ్‌ని ఫాలో చేస్తున్నారు.. ఇక ప్రొఫెషన్ విషయానికొస్తే.. ఇటీవల తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో చేసిన బైలింగ్వెల్ ఫిలిం ‘వారియర్’ అనుకున్నంతగా ఆడలేదు..

ప్రస్తుతం తన 20వ చిత్రాన్ని ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చెయ్యబోతున్నాడు.. దాని కోసమే ఇలా సరికొత్త అవతారంలోకి మారిపోయాడు రామ్.. తన కెరీర్‌లో ఈ రేంజ్ మాస్ మూవీ చేయలేదని.. కచ్చితంగా హిట్ అవుతందని ధీమాతో ఉన్నాడు.. హీరో రామ్, దర్శకుడు బోయపాటి, నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ముగ్గురికీ ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా.. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus