సంచలనం సృష్టిస్తున్న రామ్ ట్వీట్..!

ఇటీవల విడుదలయ్యి సూపర్ హిట్ సాధించింది ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం. నాలుగేళ్ళ తరువాత ఈ చిత్రంతో మంచి హిట్టందుకున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఈ సక్సెస్ ను తన టీం తో ఎంజాయ్ చేస్తున్నాడు పూరి. అయితే హీరో రామ్ మాత్రం సినిమాకి ముందు ప్రమోషన్స్ కు గాని.. సినిమా విడుదలయ్యాక సక్సెస్ సెలెబ్రేషన్స్ కు హాజరుకాలేదు. ప్రస్తుతం రామ్ విదేశాల్లో ఉన్నాడట. అయితే హాలిడే ట్రిప్ కు వెళ్ళాడా లేక.. షూటింగ్ పని మీద వెళ్ళాడా అనేది మాత్రం తెలియడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూనే వున్నాడు.

తాజాగా రామ్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. తన ట్విట్టర్ ద్వారా రామ్ మాట్లాడుతూ… ” ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో హీరో హెల్మెట్ పెట్టుకోలేదు.. హీరో పొగ త్రాగుతున్నాడు.. హీరో అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు.. అంటూ ఎంతసేపు ఇవే గాని.. హీరో అడ్డం వచ్చినవాళ్ళని చంపేస్తున్నాడు అని ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ చేయట్లేదు. ‘ప్రణామన్నా… జీవితమన్నా.. ఎవ్వరికీ లెక్క లేదు’ అంటూ కామెంట్ చేసి… ‘ఇస్మార్ట్ శంకర్’ ఒక భయంకరమైన కల్పిత పాత్ర అంటూ ట్వీట్ చేసాడు. అయితే రామ్ ఇలా ట్వీట్ చేయడం పై ఆయన అభిమానులు.. ‘రామ్ మంచి మానవత్వం గల వ్యక్తి’ అంటూ ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం ‘అంత హింస ఉన్న సినిమాలు చేసి జనాల్ని అనడం ఎందుకు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus