Hero Ram: కొత్త లుక్ తో షాకిస్తున్న రామ్ పోతినేని!

యంగ్ హీరో రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాల సక్సెస్ తర్వాత ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. రామ్ కు జోడీగా ఈ మూవీలో కృతిశెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రామ్ లింగుస్వామి కాంబో మూవీ తెరకెక్కుతోంది. పక్కా మాస్ మసాలా కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.

ప్రముఖ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి రామ్ లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో రామ్ సిక్స్ ప్యాక్ లో కనిపించగా రామ్ తాజా సినిమాలో ఫిట్ గా కనిపించబోతున్నారు. రామ్ కండలు చూపిస్తూ తాజాగా దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రామ్ కొత్త లుక్ ను చూసి అవాక్కవడం నెటిజన్ల వంతవుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కనుండటం గమనార్హం.

రామ్ ఈ సినిమాతో మరో సక్సెస్ సాధిస్తే హ్యాట్రిక్ విజయాలు రామ్ ఖాతాలో చేరతాయి. ఈ మూవీలో రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని వార్తలు వస్తుండగా ఆ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఆది పినిశెట్టి ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నారు. మాస్ సినిమాలలో వరుసగా నటిస్తున్న రామ్ ఇతర భాషల్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. లింగుస్వామి సినిమాతో రామ్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వస్తుందేమో చూడాల్సి ఉంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus