షాకిస్తున్న ‘రెడ్’ ప్రీ రిలీజ్ బిజినెస్..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ గతేడాది ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు. దీంతో మాస్ ఆడియన్స్ కూడా రామ్ సినిమా అంటే ఆసక్తి పెరిగింది. ఇక ‘ఇస్మార్ట్’ తర్వాత రామ్ చేస్తున్న చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఇక ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండీ విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ కు కూడా అద్భుతమైన స్పందన లభించింది.

దాంతో ఈ చిత్రానికి బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. ఇప్పటికే ఆంధ్రా హక్కులని 9 కోట్లకు విక్రయించారు. సీడెడ్ కూడా 4 కోట్లకు అమ్మకాలు జరిగాయి. నైజాం కూడా భారీ రేటు పలుకుతుందని ట్రేడ్ పండితుల సమాచారం. మొత్తం చూసుకుంటే.. ఈ చిత్రం నిర్మాత స్రవంతి రవికిశోర్ కు డబ్బులు మిగిల్చేలానే కనిపిస్తుంది. ఇక నివేదా పేతురాజ్, మాళవికా శర్మ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. గతంలో కిశోర్ తిరుమల తో రామ్ చేసిన ‘నేను శైలజ’ చిత్రం మంచి హిట్టు కాగా ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రం యావరేజ్ గా నిలిచింది. మరి ఈ ‘రెడ్’ చిత్రం వీరికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి..!

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus