Siddharth: బాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తా: సిద్ధార్థ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో బొమ్మరిల్లు నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో సందడి చేసిన హీరో సిద్ధార్థ్ గురించి అందరికీ సుపరిచితమే. ఈ విధంగా ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి ఒక సమయంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ విధంగా తెలుగు తమిళ భాషలలో ఎన్నో సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్ధార్థ్ ప్రస్తుతం ఏ విధమైనటువంటి అవకాశాలు లేక ఉన్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం శర్వానంద్ తో కలిసి మహా సముద్రం సినిమా ద్వారా మరోసారి తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

ఈ సినిమా కూడా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఇకపోతే హీరో సిద్ధార్థ్ సినిమాలలో కన్నా సామాజిక అంశాలపై స్పందిస్తూ పలు వివాదాలకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈయన హిందీ వెబ్ సిరీస్ ద్వారా మరోసారి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఎస్కేప్‌ లైవ్‌ అనే హిందీ వెబ్‌సిరీస్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సిరీస్‌ డిస్నీ+హాట్ స్టార్ లో మే 20 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం తనకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ సిరీస్ లో తన పాత్ర ఎంతో విభిన్నంగా ఉంటుందని, ఇలాంటి పాత్రలో నటించే అవకాశం వస్తే తప్పనిసరిగా తాను బాలీవుడ్ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తానని ఈ సందర్భంగా సిద్ధార్థ్ పేర్కొన్నారు.

అయితే తాను ఎప్పుడూ కూడా ఇలాంటి విభిన్న కథలను ఎంపిక చేసుకుని సినిమాలలో నటిస్తానని ఎప్పుడైతే తనకు అలాంటి రోల్స్ రాఓ ఆ సమయంలో యాక్టింగ్ మానేసి వేరే ఉద్యోగం చూసుకుంటానని ఈ సందర్భంగా సిద్ధార్థ్ వెల్లడించారు.ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus