Siddharth: నన్ను ఇండస్ట్రీలో తొక్కేసే ప్రయత్నం చేశారు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన అనంతరం తెలుగు సినిమా అవకాశాలను కోల్పోయారు. ఇలా అవకాశాలు లేకపోవడంతో తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సిద్ధార్థ్ గత ఏడాది హీరో శర్వానంద్ తో కలిసి మహాసముద్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఈయన పలు తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే సిద్ధార్థ్ తాజాగా నటించిన టక్కర్ సినిమా జూన్ 9వ తేదీ తెలుగు తమిళ భాషలలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సిద్ధార్థ్ఇండస్ట్రీలో తనపై చాలామంది కుట్ర చేశారని తనని తొక్కేసే ప్రయత్నాలు కూడా చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను నటించిన బొమ్మరిల్లు నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో చాలా అద్భుతంగా ఆడాయి.

ఈ సినిమాలకు పెద్ద ఎత్తున అవార్డులు కూడా వచ్చాయని తెలిపారు బొమ్మరిల్లు సినిమాకు 14 నంది అవార్డులు రాగా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సినిమాకు 11 నంది అవార్డులు వచ్చాయి వివిధ కేటగిరీలలో ఈ సినిమాలకు ఇన్ని అవార్డులు వచ్చిన నాకు మాత్రం ఒక అవార్డు కూడా రాలేదని తెలిపారు. ఆ సమయంలో కొందరు ఉద్దేశపూర్వకంగానే నాకు ఈ అవార్డు రాకుండా చేశారని ఇండస్ట్రీలో నన్ను తొక్కేసే ప్రయత్నాలు కూడా జరిగాయని సిద్ధార్థ్ తెలిపారు.

ఇక తనకు (Siddharth) అవార్డులు రాకపోయినా పెద్దగా ఏమీ బాధపడలేదని ఈయన తెలియజేశారు కానీ ఈ సినిమాలు విడుదలైనప్పుడు పుట్టని వారు తర్వాత నా సినిమాలు చూసే అన్న మీరు ఫలానా సినిమాలో నటించారు కదా మీ నటన చాలా అద్భుతంగా ఉందనీచెబుతున్నారు ఇలా చెప్పడం ఒక అవార్డు కన్నా ఎంతో విలువైనది అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus