Sivakarthikeyan: ‘ప్రిన్స్’ మూవీ థియేటర్లో డ్యాన్స్ చేసిన శివ కార్తికేయన్..!

తమిళ్ స్టార్ శివ కార్తికేయన్ ‘రెమో’, ‘డాన్’ ‘హీరో’, ‘డాక్టర్’ లాంటి డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఫస్ట్ మూవీ ‘జాతిరత్నాలు’ తో అందరి మతులూ పోగొట్టి, కడుపుబ్బా నవ్వించి, అందరి మనసులూ గెలుచుకున్న యంగ్ డైరెక్టర్ అనుదీప్ తన రెండో సినిమాని తెలుగు, తమిళ్ లో చెయ్యడమే కాక, శివ కార్తికేయన్ ని డైరెక్ట్ గా తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాడు. ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్కా హీరోయిన్ గా పరిచయమవుతోంది.

‘ప్రిన్స్’ మూవీ ప్రోమోస్, సాంగ్స్ సినిమా మీద అంచనాలు పెంచాయి. దీపావళి కానుకగా ఈ శుక్రవారం (అక్టోబర్ 21) తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఓవర్సీస్ ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి టాకే చెప్తున్నారు. అనుదీప్ మళ్లీ తన మార్క్ క్లీన్ కామెడీతో ఆకట్టుకున్నాడంటూ.. సినిమా హిట్ అనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తమ సినిమా రిలీజ్ రోజు కాస్త కష్టమైనా కానీ ఫ్యాన్స్, ఆడియన్స్ తో కలిసి థియేటర్లో చూడ్డానికి స్టార్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

ప్రేక్షకాభిమానుల ఈలలు, గోల మధ్య సినిమా చూడ్డం అనేది థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. అలాగే శివ కార్తికేయన్ కూడా జనాల మధ్య థియేటర్లో సినిమా చూశాడు. తెలుగులోనా, తమిళా అనేది తెలియదు కానీ ‘బింబిలకీ బింబిలికీ పిల్లా పీ’ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు బాల్కనీలో నిలబడి సాంగ్ ఎంజాయ్ చేస్తూ సంతోషంగా డ్యాన్స్ చేశాడు శివ కార్తికేయన్. హీరో, ఆడియన్స్ లో కూర్చుని తన సినిమా సాంగ్ ఎంజాయ్ చెయ్యడాన్ని చూసి అక్కడున్నవారంతా షాక్ అయ్యారు.

తర్వాత శివ కార్తికేయన్ తో కలిసి హంగామా చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ‘డాన్’, ‘డాక్టర్’ మూవీస్ తో వరుసగా 100 కోట్ల వసూళ్లు రాబట్టిన శివ కార్తికేయన్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడంతో పాటు ముచ్చటగా మూడోసారీ వంద కోట్ల మార్క్ టచ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే టాక్ వినిపిస్తోంది..

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus