మంచు లక్ష్మీకే మొత్తం క్రెడిట్ ఇచ్చేస్తున్న సూర్య..!

తమిళ్ తో పాటు తెలుగులో కూడా స్టార్ హీరోగా ఎదిగాడు సూర్య. ఇతని సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. ఈయన నటించిన గత రెండు సినిమాలు.. ‘ఎన్జీకే’ ‘బందోబస్త్’ వంటివి పెద్దగా ఆడలేదు. దాంతో త్వరలో విడుదల కాబోతున్న ‘సురారై పొట్రు'(‘ఆకాశం నీ హద్దురా’) పైనే ఆశలు పెట్టుకున్నారు సూర్య అభిమానులు. దీపావళి కానుకగా నవంబర్ 12న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది.

‘గురు’ వంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన సుధా కొంగర ఈ చిత్రానికి డైరెక్టర్. ఇదిలా ఉండగా.. తాజాగా సూర్య.. మంచు లక్ష్మీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంలో మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషించారు. ట్రైలర్ కూడా ఈ మధ్యనే విడుదలయ్యింది. దాని పై మంచు లక్ష్మి తన సోషల్‌ మీడియాలో స్పందించింది. ‘ట్రైలర్ చాలా బాగుంది. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను.

ఈ దీపావళి మరింత కాంతివంతం కానుందని ఆశిస్తున్నాను’ అంటూ పేర్కొంది. మంచు లక్ష్మీ కామెంట్స్ కు సూర్య జవాబిస్తూ .. “ఈ చిత్రాన్ని నీకు చూపించాలనే నేను కూడా ఎదురుచూస్తున్నాను. దీని క్రెడిట్‌ మొత్తం నీదే. మోహన్‌ బాబు గారిని మా సినిమా కోసం ఒప్పించిందే నువ్వు. చాలా థ్యాంక్స్‌. ఇది నాకు బ్లెస్సింగ్ లాంటిది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus