Suriya, Karthi: సూర్య కార్తీ కాంబినేషన్ లో మూవీ.. మామూలుగా ఉండదంటూ?

కోలీవుడ్ స్టార్ హీరోలైన సూర్య, కార్తీలకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ హీరోలు సినిమా సినిమాకు క్రేజ్ ను పెంచుకుంటున్నారు. సూర్య, కార్తీ ఒకే సినిమాలో కలిసి నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఆ కోరిక నెరవేరుతుందో లేదో తెలీదు కానీ సూర్య నిర్మాణంలో కార్తీ హీరోగా సినిమా అంటూ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. కార్తీ ప్రస్తుతం నలన్ కుమారస్వామి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించడానికి సిద్ధమయ్యారు. 96 సినిమాతో సక్సెస్ సాధించిన ప్రేమ్ కుమార్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. సూర్య ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఉండదని తెలుస్తోంది.

ఖైదీ సినిమాలో కూడా కార్తీకి జోడీ లేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదనే సంగతి తెలిసిందే. అరవిందస్వామి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కార్తీ, అరవిందస్వామి పాత్రల చుట్టూ ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాతో కార్తీ ఏ రేంజ్ హిట్ అందుకుంటారో చూడాలి. కార్తీ సూర్య నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాకు రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సూర్య, కార్తీ (Karthi) భవిష్యత్తులో కలిసి నటించాలని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. సూర్య, కార్తీలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సూర్య, కార్తీ టాలెంట్ తో ఈ స్థాయికి ఎదిగారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus