చాలా తప్పులు చేశాను, కానీ.. అన్నిటి నుంచి చాలా నేర్చుకున్నాను

చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 70 సినిమాల్లో నటించిన తనీష్ “నచ్చావులే”తో హీరోగా పరిచయమై మంచి హిట్టే అందుకున్నాడు. ఆ తర్వాత కూడా “రైడ్”తో మంచి సక్సెస్ సొంతం చేసుకున్నా తనీష్ ను చూసి తరుణ్, ఉదయ్ కిరణ్ తరహాలో ఇండస్ట్రీకి మరో యువ హీరో దొరికాడు అనుకున్నారందరూ. కానీ.. తనీష్ మధ్యలో మాస్ సినిమాలు, మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడడంతో కెరీర్ కాస్త చతికిలపడింది. నటుడిగా తన స్టామినా ప్రూవ్ చేసుకోవడం కోసం విలన్ గా కూడా నటించినా లాభం లేకపోయింది. అయితే.. ఇటీవల వచ్చిన “రంగు” కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా.. హీరోగా తనీష్ కు మంచి పేర్కొచ్చింది.

తనీష్ హీరోగా ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని మీడియాతో ముచ్చటించిన తనీష్ మాట్లాడుతూ.. “నా కెరియర్ లో హిట్స్ ఉన్నాయి ప్లాప్స్ ఉన్నాయి. కానీ నా జర్నీ మాత్రం కొనసాగుతుంది. నేను తెలియక చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను. వాటిలో ఒకటి మీడియా కి దూరంగా ఉండటం. అందుకే ఈ ప్రత్యేక సందర్భాన్ని మీడియాతో పంచుకోవాలనిపించింది. నా ప్రతి అడుగులోనూ మీడియా నాకు సపోర్ట్ చేసింది. నా మంచి, చెడును ప్రజలముందు పెట్టింది. కెరియర్ లో పడ్డాను, లేచాను. ఈ పదేళ్ళ జర్నీలో చాలా ఎత్తు పల్లాలు చూసాను. అవి నన్ను రాటు తేల్చాయి. నేను హీరో అనే మైండ్ సెట్ తో ఇండస్ట్రీ కి రాలేదు. అలాంటి పాత్రలు అని గిరిగీసుకోలేదు. నా కొన్ని సినిమలు బాగున్నాయని టాక్ వచ్చిన ఆశించిన విజయం సాధించని సందర్భాలున్నాయి కానీ అది పబ్లిసిటీ లోపమా..? సరైనా రిలీజ్ దొరకకా..? లాంటి విషయాలపై ఎవరి మీదా కంప్లైంట్స్ లేవు. బిగ్ బాస్ నన్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ప్రతి ఇంటిలోకి తీసుకువెళ్ళింది. ఆ షో నాకు చాలా ఎమోషనల్ మూమెంట్స్ ని మిగిల్చింది. రంగు తర్వాత మరో కథను ఫైనలైజ్ చేసాను. మిగిలిన వివరాలు తర్వలో అందిస్తాను” అని ఎమోషనల్ అయ్యాడు. అలాగే.. ఈ పదేళ్ళలో నేను సాధించింది పెద్దగా ఏమీ లేదు, ఇకపైనే నటుడిగా ఏమైనా సాధించాలి అని తనీష్ చెప్పడం అతను ఎంత హానెస్ట్ గా ఉంటున్నాడు అనేందుకు నిర్వచనం. హీరోగా మాత్రమే కాదు వ్యక్తిగానూ తనీష్ చాలా పొరపాట్లు చేశాడు… అయితే ఇప్పుడు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నాడు. సో, ఇకనైనా తనీష్ తన కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకొని.. ప్రేక్షకులకు మంచి సినిమాలు అందిస్తాడని ఆశిద్దాం

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus