కోలీవుడ్‌లో ఆ మాటకొస్తే మొత్తం ఇండియన్ సినిమాలో ప్రయోగం అనే మాటొస్తే.. ఠక్కున కొనసాగింపుగా వచ్చే హీరో పేర్లలో విక్రమ్ తొలి స్థానాల్లో ఉంటాడు. చేసిన సినిమాల్లో ప్రయోగాల శాతం దాదాపు వంద శాతం అని చెప్పొచ్చు. సగటు సినిమా చేయడం ఆయనకు అస్సలు నచ్చదు. సినిమా ఫలితం సంగతి ఆయనెప్పుడూ ఆలోచించరు. గత సినిమాలో చేసిన పాత్రకు దగ్గరగా ఉంటే ఆయన ఒప్పుకోరేమో అని కూడా అంటుంటారు. అలాంటి విక్రమ్ ఇప్పుడు ‘తంగలాన్’ అంటూ ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నారు.
‘తంగలాన్’ సినిమాకు సంబంధించిన ఓ వీడియో ఇటీవల విడుదలైంది. అందులో విక్రమ్‌ను చూసి, అతని కష్టాన్ని చూసి ఫ్యాన్స్ ఫుల్ కిక్ ఫీల్ అవుతున్నారు. విక్రమ్ స్థాయి సినిమా ఇది.. వన్స్ కిక్ అయితేనే లెక్కలు మామూలుగా ఉండవు అంటూ సోషల్ మడియాలో సందడి చేస్తున్నారు. పా.రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోలార్ గోల్డ్ ఫీల్డ్‌లోని కార్మికుల జీవితాల చుట్టూ జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. 1800ల కాలంలో సాగే పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోంది. విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.
విక్రమ్ (Vikram) ఎంత కష్టపడినా దురదృష్టవశాత్తు ఆ స్థాయిలో సక్సెస్ లేక వెనుకాడబడుతున్నాడు. అయితే ప్రయాగాలు చేయడంలో కమల్ హాసన్‌ను మించిపోయాడు అంటారు. మరోసారి ‘తంగలాన్’ సినిమాతో అదే చేసి చూపించాడు. ‘ఐ’ సినిమా సమయంలో ఆరోగ్యాన్ని రిస్కులో పెట్టి మరీ వేసిన కురూపి గూని వేషం కట్టిన విక్రమ్.. ఇప్పుడు ఇందులోనూ అంతే రిస్క్ చేశాడు అని చెప్పాలి. అర్ధనగ్నంగా వయసు మళ్లిన పాత్రలో విక్రమ్ కనిపించాడు. సగం జుత్తు రాలిపోయి మొహమంతా కమిలిపోయి కొత్తగా కనిపిస్తున్నాడు.
అడవులు, కొండలు, కోనలు, రాతి యుగం మనుషులు ఇలా వాతావరణం కొత్త లోకంలో ఉంది. వెనుకబడిన వర్గాల భావజాలాన్ని తెరమీద ఆవిష్కరించే పా.రంజిత్ ఇందులోనూ అలాంటి ప్రయత్నమే చేశారు అని తెలుస్తోంది. మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ చిత్రం 3Dలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదలచేయనున్నారు.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!