తాజాగా విశాల్ ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘నడిగర్ సంగం’ అధ్యక్షుడిగా తన ఇష్ఠానుసారంగా ప్రవర్తిస్తున్నాడని, ఒకే రోజున 9 సినిమాల విడుదలకు అంగీకరించడం కొంతమంది నిర్మాతలకి నష్టం వాటిల్లేలాగా ఉంటున్నాయని కొందరు నిర్మాతలు విశాల్ కు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై విశాల్ ను అరెస్ట్ చేసారు. అయితే తరువాత విడుదలైనప్పటికీ విశాల్ చాలా నిరుత్సాహానికి లోనైనట్టు తెలుస్తుంది.
వచ్చే సవంత్సరం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నేను పోటీ చేయను అంటూ విశాల్ తెలిపాడు. ఇక ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం కూడా తనకు లేదని, పోటీ చేయననని తేల్చి చెప్పాడు. నిర్మాతల మండలిలో ఇటీవల ఏర్పడిన విభేదాల గురించి విశాల్ మాట్లాడుతూ.. “పోలీసులు నన్ను అరెస్ట్ చేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది, నా ఎదుగుదలను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు అంటూ తెలిపాడు.టీఎఫ్‌పీసీకి నేను ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయ్యాను… నన్ను ఆపే అధికారం ఎవరికీ లేదు. నన్ను దెబ్బతీసేందుకు సంఘం నిధులు దుర్వినియోగం చేశాననే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిధుల వినియోగానికి సంబంధించి ప్రతీదీ రికార్డెడ్‌గా ఉంది, ఇటువంటి ఆరోపణలు విన్నప్పుడల్లా నవ్వొస్తుంది” అంటూ విశాల్ తెలపడం గమనార్హం