విశాల్ వివాహానికి ముహూర్తం ఖరారు!
- May 11, 2019 / 12:42 PM ISTByFilmy Focus
కోలీవుడ్ క్రేజీ హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. డిఫరెంట్ సినిమాలు చేస్తూ.. అట్లాగే నడిగర్ సంగం ప్రెసిడెంట్ గా కూడా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘టెంపర్’ రీమేక్ అయిన ‘అయోగ్య’ చిత్రంతో తమిళ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యింది. ఇక ఇటీవల విశాల్ కు ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కి చెందిన ఒక వ్యాపారవేత్త కూతురైన అనీషా రెడ్డితో విశాల్ కి నిశ్చితార్థం జరిగింది. ఈమె ‘పెళ్ళిచూపులు’ చిత్రంలో విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ గా కూడా నటించింది.
- మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఇక తాజాగా విశాల్ పెళ్ళికి ముహూర్తం కూడా ఫిక్సయ్యిందని సమాచారం. అక్టోబర్ 9న వీరి వివాహం జరపడానికి పెద్దలు నిర్ణయించిచారట. అయితే వీరి వివాహం హైదరాబాద్ లో జరుగుతుందా? చెన్నై లో నిర్వహిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. విశాల్ ఈ విషయాన్నీ తొందర్లోనే వెల్లడించనున్నాడని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.












