Heroes: ఆ హీరోతో అనుకోని వేరొక హీరోతో తీసిన సినిమాలు ఏంటో తెలుసా?

స్టార్ హీరోల సినిమాలంటే బోలెడన్ని లెక్కలు. ఇమేజ్… మార్కెట్… అభిమానులు.. నిర్మాతలతో ఉన్న ఒప్పందాలు.. ఇలా ఎన్నెన్నో. అన్నీ కుదిరితేనే సినిమా పట్టాలెక్కుతుంది. ఒక్క విషయం దగ్గర తేడా వచ్చినా అనుకున్న కలయికలో సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుంది. అందుకే మొదట కొన్ని కొన్ని కలయికలు ప్రచారంలోకి వచ్చినా.. వాళ్లు సినిమా కోసం కొంత దూరం ప్రయాణం చేసినా సరే… అనూహ్యంగా ఆ కలయికలు మారిపోతుంటాయి. అదే ప్రాజెక్ట్ ఎవరూ ఊహించని మరో కొత్త కలయికతో కుదురుతూ ఉంటుంది. గడిచిన రెండు మూడేళ్లలో ఇలాంటి అనూహ్యమైన కలయికలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

(Hero) అగ్ర కథానాయకుడు చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఆయన కోసం సీనియర్లు మొదలుకొని.. యువతరం దర్శకుల వరకూ కథలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికీ ఆయన చుట్టూ యువ దర్శకులే. చిరు రీ ఎంట్రీ సమయంలోనే చిరంజీవి – పూరి జగన్నాథ్ కలయికలో సినిమా ప్రచారంలోకి వచ్చింది. ‘ఆటోజానీ’ అనే కథ కూడా సిద్ధమైంది. కానీ కొన్ని కారణాల రీత్యా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దాంతో ఆ స్క్రిప్ట్ పక్కన పెట్టి దర్శకుడు పూరి జగన్నాథ్ వేరే కథానాయకులతో సినిమాలు తీయడం మొదలు పెట్టారు.

‘గాడ్ ఫాదర్’ సినిమా కోసం మొదట ఆ స్క్రిప్ట్ప సీనియర్ దర్శకుడు వి.వి.వినాయక్ కొన్నాళ్లు పనిచేశారు. ఆ తర్వాత ఆయన స్థానంలోకి మోహన్ రాజా వచ్చి సినిమాని తీశారు. చిరంజీవి – సుజీత్ కలయికలోనూ ఓ సినిమా కోసం కొన్ని రోజులు పనులు సాగాయి. కానీ ఆ ప్రాజెక్ట్ కుదరలేదు. ఇప్పుడు సుజీత్… పవన్ కల్యాణ్ ‘ఓజీ’ చేస్తున్నారు. కొన్నాళ్ల కిందట చిరంజీవి – వెంకీ కుడుముల కలయికలో సినిమా కుదిరినా… ఆ తర్వాత అది కార్యరూపం దాల్చలేదు.

ఇప్పుడు వెంకీ కుడుముల… నితిన్ సినిమా చేస్తున్నారు. రచన దశలోనూ… పూర్వ నిర్మాణ పనుల దశలోనూ ఒకొక్క సినిమా ఒక్కో కారణంతో ఆగిపోతుంటుంది. మళ్లీ కొత్త బృందాలు రంగంలోకి దిగి మరో సినిమా కోసం కసరత్తులు మొదలుపెడుతుంటాయి. రామ్చరణ్, ఎన్టీఆర్ల విషయంలోనూ ఇదే జరిగింది. కొన్నేళ్ల కిందట రామ్ చరణ్- కొరటాల శివ కలయికలో సినిమా కుదిరింది. కానీ అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. ‘ఆచార్య’తో ఆ కలయిక కుదిరింది. రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా కలయికలో సినిమాని ఎవ్వరూ ఊహించలేదు.

మొదట ఎన్టీఆర్ – బుచ్చిబాబు కలయికలో సినిమా పక్కా అయ్యింది. ఎన్టీఆర్ చేయాల్సిన ప్రాజెక్టులు ఎక్కువగా ఉండటంతో… బుచ్చిబాబు తన కథని రామ్ చరణ్ కు వినిపించడంతో ఆయన పచ్చజెండా ఊపారు. ఆ కలయికలో సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా అనుకున్నారు మొదట. కానీ ఆ స్థానంలో ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో సినిమా మొదలైంది.

మరోవైపు త్రివిక్రమ్.. మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా ఇదివరకు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నారు. ప్రాజెక్ట్ అప్పట్లో ప్రకటించారు కూడా. కానీ అల్లు అర్జున్ ‘పుష్ప’ కొనసాగింపుపైనే దృష్టి పెట్టారు. ఇంకా ఇలాంటి కలయికలు మీకు తెలిసినవి ఏమైనా ఉంటో కామెంట్స్ రూపం తెలియజేయండి..

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus